YS Jagan - Chandrababu: చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన సీఎం వైఎస్ జగన్..

By Sumanth KanukulaFirst Published Jan 18, 2022, 12:21 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ట్వీట్ చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ట్వీట్ చేశారు. చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కావాలని కోరకుంటున్నట్టుగా సీఎం జగన్ తన ట్విట్టర్‌ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

ఇక, తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయాన్ని చంద్రబాబు నాయుడు మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని వివరించారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్టు తెలిపారు. తనతో కాంటాక్టులోకి వచ్చిన వారూ కరోనా టెస్టు చేసుకోవాలని కోరారు. తన కుమారుడు నారా లోకేష్ కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. లోకేష్‌కు కరోనా సోకిన తర్వాతి రోజే చంద్రబాబుకూ పాజిటివ్ అని తేలింది.

 

Wishing a speedy recovery & good health for Sri garu.

— YS Jagan Mohan Reddy (@ysjagan)

ఇక, ఏపీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 22వేల మందికి కరోనా టెస్టులు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. ఆ బులెటిన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో 4,108 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా వెయ్యికి పైగా కేసులు చిత్తూరు, విశాఖపట్నంలో నమోదయ్యాయి. చిత్తూరులో 1004 కేసులు, విశాఖపట్నంలో 1018 కేసులు రిపోర్ట్ అయ్యాయి. కాగా, 696 మంది పేషెంట్లు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.  కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 30 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

click me!