(వీడియో) ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

First Published Nov 6, 2017, 10:21 AM IST
Highlights
  • ఇడుపులపాయలో జనసంద్రం పోటెత్తింది. ఎటుచూసినా జనం..జనం. ఒకటే జనం.
  • తమ అభిమాన నాయకుడు మొదలుపెడుతున్న ప్రజా సంకల్పయాత్రను ప్రత్యక్షంగా చూడటానికి, పాల్గొనటానికి రాష్ట్రం నలుమూలల నుండి అభిమానులు, నేతలు, శ్రేణులు పోటెత్తారు.

ఇడుపులపాయలో జనసంద్రం పోటెత్తింది. ఎటుచూసినా జనం..జనం. ఒకటే జనం. తమ అభిమాన నాయకుడు మొదలుపెడుతున్న ప్రజా సంకల్పయాత్రను ప్రత్యక్షంగా చూడటానికి, పాల్గొనటానికి రాష్ట్రం నలుమూలల నుండి అభిమానులు, నేతలు, శ్రేణులు పోటెత్తారు. వీరిలో అత్యధికులు ఆదివారం అర్ధరాత్రి, సోమవారం తెల్లవారుజాముకే ఇడుపులపాయకు చేరుకున్నారు.

ఉదయం 8.30 గంటల ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో నివాళులర్పించారు. కుటుంబసభ్యులతో పాటు పలువురు నేతలు వెంటరాగా ఘాట్ నుండే సరిగ్గా 9.47 నిముషాలకు పాదయాత్రను జగన్ ప్రారంభించారు.

వైఎస్సాఆర్ ఘాట్ వద్ద నుండి జగన్ కుటుంబసభ్యులు, నేతలు తోడురాగా బహిరంగసభా వేదిక వద్దకు పాదయాత్ర మొదలుపెట్టారు. 25 పార్లమెంటు నియోజకవర్గల ఇన్చార్జిలు కూడా ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈరోజు ప్రారంభమవుతున్న ప్రజాసంకల్పయాత్ర దాదాపు 3 వేల కిలోమీటర్లు సాగునున్న విషయం అందరకీ తెలిసిందే. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ 125 బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు.

ప్రజాసంఘాలతో 20 వేల సమావేశాలు నిర్వహించనున్నారు. 5 వేల వరకూ రహదారి సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇడుపులపాయలో మొదలవుతున్న పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. తన పాదయాత్రలో 125 నియోజకవర్గాలను కవర్ చేస్తారు.

మిగిలిని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తారు. పాదయాత్ర నిర్విఘ్నంగా జరగటానికి వివిధ జిల్లాల్లో నేతలు ఎక్కడికక్కడ తగిన ఏర్పాట్లు చేసారు.

 

click me!