ఎపీ సీఎం వైఎస్ జగన్ మామ గంగిరెడ్డి మృతి

Published : Oct 03, 2020, 07:28 AM ISTUpdated : Oct 03, 2020, 07:37 AM IST
ఎపీ సీఎం వైఎస్ జగన్ మామ గంగిరెడ్డి మృతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి శుక్రవారం రాత్రి మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ, ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. 

గంగిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యుడు. పేదల డాక్టరుగా ఆయనకు పేరుంది. గంగిరెడ్డి 2001 - 2005 మధ్య కాలంలో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు 

2003లో రైతులకు రబీ వితనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టర్ కార్యాలయం వరకు గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. గంగిరెడ్డిని పరామర్శించడానికి ఇటీవల వైఎస్ జగన్ హైదరాబాదు వచ్చిన విషయం తెలిసిందే.

తిరుమల నుంచి వైఎస్ జగన్ నేరుగా హైదరాబాదు వచ్చి గంగిరెడ్డిని పరామర్శించారు. ఆరోగ్యం విషమించడంతో గంగిరెడ్డి మరణించారు.ఆయన అంత్యక్రియలో శనివారం పులివెందులలో జరుగుతాయి. వైఎస్ జగన్ ఉదయం 11 గంటలకు పులివెందుల చేరుకుంటారు. వైఎస్ విజయమ్మ తాడెేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరారు.

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్