వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మూడో విడత నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నిర్వహించిన సభలో జగన్ ప్రసంగించారు.
ఒంగోలు:YSR Sunna Vaddi Scheme కింద మూడో విడత నిధులను శుక్రవారం నాడు సీఎం YS Jagan విడుదల చేశారు. కోటి 2 లక్షల మందికి రూ. 1261 కోట్లను మూడో విడత కింద ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా Ongoleలో నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
9.76 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇప్పటివరకు మొత్తం వడ్డీ కింద రూ. 3615 కోట్లు చెల్లించినట్టుగా సీఎం జగన్ చెప్పారు. గతంలో 12 శాతం వడ్డీని స్వయం సహాయక గ్రూపులు కట్టాల్సి వచ్చేదన్నారు. మహిళలకు మంచి జరగాలని గత ప్రభుత్వం భావించలేదని సీఎం జగన్ చెప్పారు.
చంద్రబాబు సర్కార్ సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసిన పరిస్థితులున్నాయని ఆయన విమర్శించారు. టీడీపీ సర్కార్ అక్కా చెల్లెళ్లకు రూ. 2036 కోట్లను చెల్లించకుండా ఎగనామం పెట్టిందన్నారు. చంద్రబాబు సర్కార్ మహిళలను నట్టేట ముంచిందని జగన్ విమర్శలు చేశారు. ప్రతి ఏటా మహిళలకు భరోసాను కల్పిస్తున్నామని సీఎం జగన్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలతో మహిళల ముఖాల్లో చిరునవ్వు కన్పిస్తుందన్నారు.
తమది మహిళా పక్షపాత ప్రబుత్వమని సీఎం జగన్ చెప్పారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల మహిళా సంఘాలు డీ గ్రేడ్ కి పడిపోయాయన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీ గ్రేడ్ కి పడిపోయిన స్వయం సహాయక సంఘాలు 1 శాతంలోపే ఉన్నాయన్నారు.
విద్యాదీవెన పథకం కింద 21.55 లక్షల మందికి రూ.6,969 కోట్ల లబ్ది జరిగిందన్నారు.గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను కూడా తామే చెల్లించామని సీఎం గుర్తు చేశారు.జగనన్న వసతి దీవెన ద్వారా 18.77 లక్షల మందికి రూ.3,329 కోట్ల మందికి ప్రయోజనం కలిగిందన్నారు. వైఎస్ఆర్ ఆసరాతో రూ. 12,758 కోట్లు చెల్లించామన్నారు. వైఎస్ఆర్ చేయూతతో రూ. 9,180 లబ్దిదారులకు ఇచ్చామని జగన్ చెప్పారు.వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద ఏటా రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా సీఎం జగన్ వివరించారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద రూ. 589 కోట్లు చెల్లించామన్నారు.