భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిని ఉంచుకొని రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. నంద్యాలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమం కింద నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
నంద్యాల: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో విద్యా వ్యవస్థల్లో మార్పులు చేర్పులు తీసుకొచ్చామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
Jagananna Vasathi Deevena కార్యక్రమం కింద రెండో విడత 10,68,150 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 1,024 కోట్లు ఏపీ సీఎం YS Jagan శుక్రవారం నాడు జమ చేశారు. ఈ సందర్భంగా Nandyalలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
మన పిల్లలు బాగా చదువుకుని ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు తమ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామన్నారు. ఒకటో తరగతి నుండి యూనివర్శిటీ వరకు ఈ మార్పులు చేశామన్నారు. ఇందులో భాగంగానే సర్కారీ బడుల్లో మౌళిక వసతులను మెరుగుపర్చామన్నారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూల్స్ లో వసతులు కల్పిస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు.
అంతేకాదు రాష్ట్రానికి కొత్తగా 16 Medical colleges ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చదువుకుంటేనే మన తలరాతలను మారుతాయన్నారు. పేదింటి తల్లులు తమ పిల్లలను చదివించాలని సీఎం జగన్ కోరారు.
పేదరికం కారణంగా రాష్ట్రంలో పేద students చదువులు ఆగిపోకూడదనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
ప్రజలకు మరింత చేరువగా పాలనను చేస్తానని గతంలో తాను గతంలోనే మాటిచ్చినట్టుగా జగన్ చెప్పారు. అందుకే కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసినట్టుగా సీఎం వివరించారు.
పేదరికం కారణంగా విద్యార్ధుల చదువులు ఆగిపోకూడదని తమ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చినట్టుగా సీఎం జగన్ చెప్పారు. విద్యార్ధుల చదువుల కోసం పిల్లల తల్లిదండ్రులు అప్పుల పాలు కాకుండా ఉండాలనేది తమ అభిమతమన్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు అని సీఎం జగన్ చెప్పారు.
విద్యార్ధుల చదువుల కోసం పూర్తి స్థాయి ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను అందిస్తున్నామన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేద విద్యార్ధుల చదువు కోసం ఒక్క అడుగు ముందుకు వేశారన్నారు. కానీ తాను మాత్రం YSR కొడుకుగా తన తండ్రి కంటే మరో రెండు అడుగులు వేస్తున్నానని చెప్పారు.
గతంలో పేదల చదువుల కోసం ప్రభుత్వాలు అరకొర వసతులు కల్పించేవన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్ధుల చదువు కోసం అనేక కార్యక్రమాలు తీసుకొందన్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్ధులున్నా చదివించాలన్నారు. ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయి పీజు రీఎంబర్స్ మెంట్ ను అందిస్తామని సీఎం జగన్ చెప్పారు.జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు ఈ మూడేళ్ల కాలంలో రూ. 10 వేల 200 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ చెప్పారు.