(వీడియో) ‘జగన్ స్పీక్స్’ వీడియోను రిలీజ్ చేసిన జగన్

Published : Nov 05, 2017, 08:34 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
(వీడియో) ‘జగన్ స్పీక్స్’ వీడియోను రిలీజ్ చేసిన జగన్

సారాంశం

ప్రజా సంకల్ప యాత్ర ఉద్దేశ్యాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. యాత్ర ఉద్దేశ్యాన్ని వివరిస్తూ ఆదివారం రాత్రి జగన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసారు.

ప్రజా సంకల్ప యాత్ర ఉద్దేశ్యాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. యాత్ర ఉద్దేశ్యాన్ని వివరిస్తూ ఆదివారం రాత్రి జగన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసారు. 2 నిముషాల 19 సెకండ్ల నిడివి గల వీడియో క్లిప్పింగిలో తన పాదయాత్ర  7 ఏనెలు సాగుతుందన్నారు. 3 వేల కిలోమీటర్ల ప్రయాణం చేయనున్నట్లు చెప్పారు. నవరత్నాల గురించి వివరించటం, మరింత మెరుగుపరిచేందుకు ప్రజల సలహాలు తీసుకోవటమే అన్నారు. మ్యానిఫెస్టో రూపకల్పనలో కూడా ప్రజల సలహాలు, సూచనల మేరకే ఎన్నికల సమయంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాదయాత్ర నిర్విఘ్నంగా సాగటానికి, పాదయాత్రలో భాగస్వాములు కావాలంటూ జగన్ అప్పీల్ చేసారు. యాత్ర విశేషాలను, అనుభవాలను ‘జగన్ స్పీక్స్’ ద్వారా ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటానని చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu