AP Cabinet Reshuffle: కేబినెట్‌లో బీసీలకు పెద్ద పీట వేయనున్న జగన్

By narsimha lode  |  First Published Apr 10, 2022, 10:01 AM IST


మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో ఏపీ సీఎం వైఎస్ జగన్  బీసీలకు ఇతర సామాజిక వర్గాలకు పెద్దపీట వేయనున్నారు. 2019లో కేబినెట్ లో అగ్రవర్ణాల కంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు జగన్ పెద్ద పీట వేశారు. ఈ దఫా కూడా జగన్ అదే వర్గాలకు పెద్దపీట వేయనున్నారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS Jagan తన కేబినెట్ ను ఈ నెల 11న పునర్వవ్యవస్థీకరించనున్నారు. సామాజిక సమీకరణాలకు జగన్  ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీని అధికారంలో తీసుకిచ్చే విధంగా సామాజిక సమీకరణాలకు జగన్ మంత్రివర్గ కూర్పు ఉండనుంది. 

 అయితే గతంలో కంటే ఎక్కువగా BCలకు ఇతర వర్గాలకు పెద్దపీట వేయనున్నారని సమాచారం. TDP ఏర్పాటైన నుండి బీసీలు ఆ పార్టీకి వెన్నెముకగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో YCPవైపు బీసీ సామాజిక వర్గం ఓటర్లు మొగ్గు చూపారని ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. 

Latest Videos

దీంతో బీసీ సామాజిక వర్గానికి Cabinet Reshuffle లో పెద్దపీట వేయాలని  జగన్ భావిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనే ప్రస్తుత మంత్రులతో సీఎం జగన్ మంత్రుల నుండి రాజీనామా పత్రాలు తీసుకున్నారు. ఈ కేబినెట్ లో   బీసీ, ఎస్సీఎస్టీ మైనార్టీలు 56 శాతంగా ఉన్నారు. 

అయితే  మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనార్టీల సంఖ్య ఇంకా పెంచే అవకాశం ఉందని సమాచారం. బీసీల సంఖ్యను కూడా పెరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీకి జగన్ అవకాశం కల్పించారు.  

ప్రస్తుతం మైనార్టీ కి చెందిన Amzath Basha డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కడప నుండి అంజద్ భాషా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో అంజద్ బాషాకు చోటు కల్పించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. Resignations సమర్పించిన మంత్రివర్గంలో అగ్రవర్ణాలకు చెందిన వారు 44 శాతం ఉన్నారు. అయితే అగ్రవర్ణాలకు మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో కూడా గతంలో ఉన్న 44 శాతం కంటే తక్కువగానే మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. 

బీసీలతో పాటు కాపులు, kamma సామాజిక వర్గాలకు జగన్ తన మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. Chandrababu Naidu  తన మంత్రివర్గంలో 13 మంది అగ్రవర్ణాలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. 12 మంది ఇతర వర్గాలకు చోటు కల్పించారు.

2019 నుండి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రం ఏ ఎన్నికలు జరిగినా కూడా ఆ పార్టీ ఘన విజయాలను నమోదు చేసింది. టీడీపీ ఘోరమైన ఓటమిని చవిచూసింది. అయితే  వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ పథం వైపునకు తీసుకెళ్లేందుకు పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడానికి గాను కొందరిని మంత్రివర్గం నుండి తప్పించనున్నారు.  

మరో వైపు అనుభవం ఉన్న వారికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు.  అదే సమయంలో ఆయా జిల్లాల్లో పార్టీ అవసరాలతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు.

2019 లో ఏపీ సీఎం వైఎస్ జగన్  మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే సమయంలోనే రెండున్నర ఏళ్లపాటే మంత్రులుంటారని జగన్  చెప్పారు.  అయితే  మూడేళ్ల తర్వాత మంత్రివర్గాన్న పునర్వవ్యవస్థీకరించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో చెప్పినట్టుగానే ఈ నెల 7వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలోనే మంత్రులను సీఎం జగన్ మంత్రుల నుండి రాజీనామాలు కోరారు. మంత్రులంతా రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. 
 

click me!