డ్రోన్లు, బాడీ కెమెరాలు, రోప్ పార్టీలు.. జగన్ పాదయాత్రకు అసాధారణ భద్రత

By sivanagaprasad kodatiFirst Published Nov 12, 2018, 11:26 AM IST
Highlights

విజయనగరం జిల్లా మేళాపువలస క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 8.30 గంటల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. మేళాపువలస కాలనీ, శ్రీదేవీ కాలనీ రోడ్డు, ములక్కాయలవలస, కాశీపట్నం సెంటర్, పాపయ్య వలస గ్రామాల మీదుగా సుమారు 6 కిలోమీటర్లు యాత్ర సాగనుంది. 

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర తిరిగి ప్రారంభమైంది. విశాఖ విమానాశ్రయంలో కత్తి దాడి తర్వాత వైద్యుల సూచన మేరకు ఇంటికే పరిమితమయ్యారు జగన్. దీంతో 17 రోజుల పాటు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ క్రమంలో ఇవాళ్లీ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. నిన్న సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయనగరం జిల్లా మేళాపువలస క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి చేరుకున్నారు.

ఇవాళ ఉదయం 8.30 గంటల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. మేళాపువలస కాలనీ, శ్రీదేవీ కాలనీ రోడ్డు, ములక్కాయలవలస, కాశీపట్నం సెంటర్, పాపయ్య వలస గ్రామాల మీదుగా సుమారు 6 కిలోమీటర్లు యాత్ర సాగనుంది.

విశాఖ విమానాశ్రయంలో దాడి నేపథ్యంలో జగన్‌కు ప్రభుత్వం మూడంచెల భద్రత కల్పించింది. 150 మంది పోలీసులో ఏర్పాటు చేసిన రోప్ పార్టీ మధ్య ఆయన యాత్ర సాగుతుంది. అలాగే 50 మంది సిబ్బంది బాడీ కెమెరాలతో రక్షణగా ఉంటారు.  

కంట్రోల్ రూమ్ నుంచి డ్రోన్ల సాయంతో పాదయాత్ర రూట్‌ను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తారు. అలాగే జగన్ బస చేసే క్యాంపు చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సెల్ఫీల విషయంలోనూ పోలీసులు ఆంక్షలు విధించారు..

జగన్‌ను కలిసే వారికి గుర్తింపు జారీ చేస్తున్నారు.. వీఐపీలకు ఎరుపు రంగు కార్తులు, జగన్‌ను అనుసరిస్తున్న వారికి నీలం రంగు కార్డులు, పాదయాత్రలో రక్షణగా ఉన్న వారికి ఆకుపచ్చ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అలాగే పాదయాత్ర మార్గంలో సీఆర్పీఎఫ్ పోలీసులు ముందుగానే తనిఖీలు చేస్తారు. రోడ్డ క్లియరెన్స్ పార్టీని ఏర్పాటు చేశారు.
 

click me!