విజయనగరం జిల్లా మేలపు వలసలో జగన్ పాదయాత్ర

sivanagaprasad kodati |  
Published : Nov 12, 2018, 02:19 PM IST
విజయనగరం జిల్లా మేలపు వలసలో జగన్ పాదయాత్ర

సారాంశం

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర తిరిగి ప్రారంభమైంది. విశాఖ విమానాశ్రయంలో కత్తి దాడి తర్వాత వైద్యుల సూచన మేరకు ఇంటికే పరిమితమయ్యారు జగన్. 

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర తిరిగి ప్రారంభమైంది. విశాఖ విమానాశ్రయంలో కత్తి దాడి తర్వాత వైద్యుల సూచన మేరకు ఇంటికే పరిమితమయ్యారు జగన్. దీంతో 17 రోజుల పాటు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ క్రమంలో ఇవాళ్లీ నుంచి విజయనగరం జిల్లా మేలపు వలసలో పాదయాత్రను ప్రారంభించారు. నిన్న సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు

పాదయాత్రలో భాగంగా కుమ్మరులతో సమావేశమైన జగన్.. కుండలు తయారు చేసే చక్రం తిప్పుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గమధ్యంలో ఓ దివ్యాంగుడు కలిసి 3 వేల లంచం ఇవ్వకపోవడంతో తనకు ఫించన్ మంజూరు చేయలేదని ఫిర్యాదు చేశాడు.. దారి పొడవునా జననేతకు స్వాగతం పలికేందుకు మహిళలు, విద్యార్థులు, వివిధ రంగాల వారు బారులు తీరారు. 

PREV
click me!

Recommended Stories

Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడ‌నం.. ఈ ప్రాంతాల్లో వ‌ర్షాలే వ‌ర్షాలు
YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై జగన్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu