
ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా చేశారు. కాగా.. ప్రస్తుత బందర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో బాలశౌరికి గత కొంతకాలంగా విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే ఆయన జనసేనలో చేరుతారనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఆ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా లేదంటే అవనిగడ్డ, పొన్నూరు అసెంబ్లీ టికెట్ కావాలని బాలశౌరి డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై క్లారిటీ వచ్చిన తక్షణం బాలశౌరి జనసేనలో చేరే అవకాశం వుంది.