బడుగు బలహీన వర్గాలకు జగన్ ద్రోహం చేశారు.. : వైకాపా స‌ర్కారుపై టీడీపీ ఫైర్

Published : Oct 30, 2023, 02:25 AM IST
బడుగు బలహీన వర్గాలకు జగన్ ద్రోహం చేశారు.. :  వైకాపా స‌ర్కారుపై టీడీపీ ఫైర్

సారాంశం

TDP: త‌మ‌ ప్రభుత్వం వివిధ వర్గాల కోసం మొత్తం 120 సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసిందని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నాయ‌కులు పేర్కొన్నారు. అయితే, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైఎస్ఆర్సీపీ ప్ర‌భుత్వం వాటన్నింటినీ రద్దు చేసి పేద, బడుగు బలహీన వర్గాలను ఇబ్బందులకు గురిచేసింద‌ని ఆరోపించారు.  

Srikakulam: త‌మ‌ ప్రభుత్వం వివిధ వర్గాల కోసం మొత్తం 120 సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసిందని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నాయ‌కులు పేర్కొన్నారు. అయితే, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైఎస్ఆర్సీపీ ప్ర‌భుత్వం వాటన్నింటినీ రద్దు చేసి పేద, బడుగు బలహీన వర్గాలను ఇబ్బందులకు గురిచేసింద‌ని ఆరోపించారు.

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలకు ద్రోహం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సింతు సుధాకర్, శ్రీకాకుళం నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ తదితరులు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలిపే వాల్‌పోస్టర్లు, కరపత్రాలను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ నేత‌లు మాట్లాడుతూ వైకాపా స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

లక్ష బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందనీ, వివిధ మత ట్రస్టులు, సంస్థలకు చెందిన 14 లక్షల ఎకరాలను వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆక్రమించారని ఆరోపించారు. ప్రభుత్వం నాసిరకం, నకిలీ మద్యం సరఫరా చేసి రాష్ట్రంలో 30 వేల మందిని బలిగొన్నారనీ, వారి కుటుంబాలను అనాథలుగా మార్చారని టీడీపీ నేతలు మండిప‌డ్డారు. టీడీపీ ప్రభుత్వం వివిధ వర్గాల కోసం మొత్తం 120 రకాల సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసిందని చెప్పిన టీడీపీ నేత‌లు.. జగన్ మోహన్ రెడ్డి వాటన్నింటినీ రద్దు చేశారనీ, దీంతో బడుగు, బలహీనవర్గాలు అల్లాడుతున్నాయ‌ని అన్నారు.

సీఎం, అధికార పార్టీ నేతలు చేస్తున్న ద్రోహానికి, పాశవిక చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైకాపాకు ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయకులు కె.సుశీల, ఎస్‌వి.రమణ, పి.విజయరామ్‌, కె.రాము తదితరులు పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu