అమిత్‌షాతో జగన్ భేటీ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

Siva Kodati |  
Published : May 26, 2019, 01:22 PM IST
అమిత్‌షాతో జగన్ భేటీ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

సారాంశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన ఆయన.. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలపై చర్చించారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన ఆయన.. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలపై చర్చించారు. అనంతరం ఆయన నేరుగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఒకొరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ఈ నెల 30వ తేదీన విజయవాడలో తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా అమిత్ షా‌ను జగన్ ఆహ్వానించారు.

30 నిమిషాల పాటు సాగిన వీరి భేటీలో రాష్ట్ర విభజన హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP