జగన్ కొలువులో ఉప ముఖ్యమంత్రి పదవులు వీరికే....

By Nagaraju penumalaFirst Published Jun 3, 2019, 3:54 PM IST
Highlights

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును నియమిస్తే కాపు సామాజిక వర్గం కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత దగ్గర అవుతుందని మరికొందరు సూచిస్తున్నారట. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెడితే భవిష్యత్ లో కాపు ఓట్లు వైసీపీకి పడే అవకాశం ఉందని అందువల్ల ఉమ్మారెడ్డి ఎంపిక కరెక్ట్ అంటున్నారట. 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వైయస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయడంతో ఏపీలో పదవుల పందేరానికి తెరలేపింది. ఇప్పటికే మంత్రి వర్గ కూర్పులో ఎవరికి అవకాశం వస్తుందా అంటూ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. 

ఎవరి లెక్కల్లో వారు ధీమాగా ఉన్నారు. అయితే గత ప్రభుత్వం అమలు చేసిన ఉపముఖ్యమంత్రి పదవులను వైయస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తారా లేదా అనేది సందేహంగా మారింది. డిప్యూటీ సీఎం పదవులు జగన్ కొనసాగిస్తారని ఒక వర్గం ప్రచారం చేస్తుంటే అలాంటిదేమీ ఉండదని మరోక వర్గం స్పష్టం చేస్తోంది. 

ఒకవేళ ఉంటే పార్టీ సీనియర్ నేత ఒకరికి కన్ఫమ్ అని మరోకటి దళితులకు ఇవ్వాలని డిమాండ్ మెుదలవుతోంది. వైయస్ జగన్ ఉపముఖ్యమంత్రి పదవులను కొనసాగిస్తే ఆ పార్టీ సీనియర్ నేత శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఉపముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

వైయస్ జగన్ కు మెుదటి నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుంటారు. రాజకీయాల్లో కురువృద్దుడు అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ రాజకీయవేత్తే కాకుండా మంచి సలహాదారుడంటూ పార్టీలో ప్రచారంలో ఉంది. 

ఏ అంశంపైనైనా ఆయనకు ఎనలేని సమాచారం ఉంటుందని పార్టీలో చెప్పుకుంటారు. అంతేకాదు డ్రాప్ట్ రూపొందించడంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును మించిన వారు లేరని పార్టీలో ప్రచారం ఉంది. పార్టీ పట్ల క్రమశిక్షణతో ఉంటూ పార్టీ కోసం శ్రమిస్తున్న వ్యక్తి కాబట్టే జగన్ ఆయనకు ఎవరికి ఇవ్వనన్ని పదవులు ఇచ్చి గౌరవిస్తుంటారని టాక్. 

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని పార్టీలో కొందరు భావిస్తున్నారు. వైయస్ జగన్ మాటకు కట్టుబడి ఉండే ఉమ్మారెడ్డికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పలువురు జగన్ కు సూచించారట.

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును నియమిస్తే కాపు సామాజిక వర్గం కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత దగ్గర అవుతుందని మరికొందరు సూచిస్తున్నారట. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెడితే భవిష్యత్ లో కాపు ఓట్లు వైసీపీకి పడే అవకాశం ఉందని అందువల్ల ఉమ్మారెడ్డి ఎంపిక కరెక్ట్ అంటున్నారట. 

ఇక రెండో ఉపముఖ్యమంత్రి పదవి మాత్రం కచ్చితంగా దళితులకు ఇవ్వాలని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉంటే వాటిలో అత్యధిక శాతం ఎమ్మెల్యేలు వైసీపీ నుంచే గెలుపొందారు. 

13 జిల్లాల నుంచి 33 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా వారిలో 31 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందగా మరోకరు టీడీపీ నుంచి, ఇంకొకరు జనసేన పార్టీ నుంచి గెలుపొందారు. 

ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 5 పార్లమెంట్ స్థానాలు రిజర్వు స్థానాలుగా ఉన్నాయి. వాటిలో నాలుగు ఎస్సీ కాగా ఒకటి మాత్రం ఎస్టీ. ఈ ఐదు పార్లమెంట్ స్థానాల్లోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందడం విశేషం. 

ఈ పరిణామాల నేపథ్యంలో 31 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలతోపాటు అనేక నియోజకవర్గాల్లో దళిత ఓటర్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించారని ఆ పార్టీ భావిస్తోంది. 

ఓటింగ్ పోలైన శాతం పరంగా యూస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల్లో మాల సామాజిక వర్గం 62.45 శాతం ఓటు వేశారని అలాగే 56.94 శాతం మాదిగ సామాజకి వర్గం వైసీపీకి ఓటు వేశారని స్పష్టమైంది. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో క్రియాశీలకంగా వ్యవహరించిన దళిత సామాజిక వర్గానికి వైయస్ జగన్ పెద్ద పీట వేయాలంటే కచ్చితంగా ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని కొందరు దళిత నేతలు సూచిస్తున్నారు.  

దళితులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తే ఉభయగోదావరి జిల్లాల నుంచే ఇవ్వాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలో మాజీమంత్రి అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ లేదా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే బాలరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితల పేర్లను పరిశీలించాలని కూడా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి సీఎం వైయస్ జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో అన్నది వేచి చూడాలి. 


 

click me!