జగన్ సూపర్ ప్లాన్, వంశీకి స్పెషల్ బెర్త్: క్యూ లైన్లో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు

By Nagaraju penumala  |  First Published Dec 10, 2019, 6:33 PM IST

త్వరలోనే ఇదేతరహా రాజకీయాన్ని నెరపేందుకు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేస్తున్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి తటస్థంగా ఉన్నారు. ఏ పార్టీలో చేరకుండా ఆయన న్యూట్రల్ గా ఉండటంతో స్పీకర్ తమ్మినేని సీతారం ప్రత్యేక స్థానం సైతం కేటాయించారు. 

అయితే వంశీ తటస్థంగా ఉండటం వెనుక వైసీపీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. వంశీమోహన్ తటస్థంగా ఉంటూ వైసీపీకి అనుబంధంగా కొనసాగుతారని తెలుస్తోంది. అవసరమైతే టీడీపీపై దాడికి దిగే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. 

Latest Videos

undefined

అందుకు నిదర్శనమే మంగళవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభోత్సవంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు వంశీ. తాను తన నియోజకవర్గం సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిస్తే టీడీపీ తనపై వేటు వేసిందని ఆరోపించారు. 

తాను టీడీపీలో ఉండలేకే పార్టీకి రాజీనామా చేశానని అందువల్ల తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని అలాగే సీటు కూడా కేటాయించాలని కోరిన సంగతి తెలిసిందే. అందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం సీటు సైతం కేటాయించేశారు. 

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లీకులు

త్వరలోనే ఇదేతరహా రాజకీయాన్ని నెరపేందుకు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేస్తున్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సైతం వైసీపీలో చేరతారని నిలదీస్తున్నారు. వీరంతా టీడీపీకి రాజీనామా చేసి న్యూట్రల్ గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇకపోతే విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ బాబులతోపాటు ఎమ్మెల్యే గణబాబు సైతం వైసీపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 

నాకు హక్కు లేదా, సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు... వంశీ..

వీరంతా సీఎం వైయస్ జగన్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నప్పటికీ జగన్ పాలనపై అభినందనలు తెలుపుతున్నారు. జగన్ పాలనను భేష్ అంటూ చంద్రబాబుకు కొరకరాని కొయ్యలా మారుతున్నారు. 

తాజాగా వల్లభనేని వంశీ విషయంలో స్పీకర్ అనుసరించిన తీరును చూసిన ఎమ్మెల్యేలు అంతా తమ పదవికి ఎలాంటి ఎసరు రాదని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వంశీలా న్యూట్రల్ గా ఉంటూ వైసీపీకి అనుబంధంగా ఉంటే సరిపోతుందని ఆలోచిస్తున్నారు. 

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు రావాలంటే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కండీషన్ పెట్టారు సీఎం జగన్. దాంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా వంశీ విషయంలో స్పీకర్ వ్యవహరించిన తీరు, వైసీపీ ఎమ్మెల్యేల విషెస్ ను చూసిన ఆ ఎమ్మెల్యేలు త్వరలోనే టీడీపీకి రిజైన్ చేసి పైకి న్యూట్రల్ గా ఉంటూ వైసీపీకి తటస్థంగా ఉంటారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు కరెక్ట్ అనేది త్వరలోనే తేలనుంది. 

ఆ పాపంలో నాకు భాగం ఉంది, 15 ఏళ్లు ప్రతిపక్షానికే: స్పీకర్ తమ్మినేని సంచలనం..
 

click me!