విద్యుత్ ఉత్పత్తిలో ఏపీలో మరో ముందడుగు:నెల్లూరులో జెన్ కో యూనిట్ జాతికి అంకితం చేసిన జగన్

By narsimha lode  |  First Published Oct 27, 2022, 1:25 PM IST

నెల్లూరు జిల్లాలోని నేలటూరులో ఏపీ  జెన్  కో  మూడో  విద్యుత్ ప్లాంట్ ను ఏపీ  సీఎం  వైఎస్ జగన్  గురువారం నాడు జాతికి అంకితం చేశారు.
 



నెల్లూరు:  విద్యుత్  ఉత్పత్తి  రంగంలో రాష్ట్ర ప్రభుత్వం  మరో  ముందడుగు వేసిందని ఏపీ సీఎం  వైఎస్ జగన్ చెప్పారు.నెల్లూరు  జిల్లలోని ముత్తకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్  కో  మూడో యూనిట్ ను ఏపీ సీఎం  వైఎస్  జగన్ గురువారం నాడు  జాతికి  అంకితం  చేశారు.  ఈ సందర్భంగా  నిర్వహించిన సభలో ఆయన  ప్రసంగించారు.  అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్లాంట్ ను నిర్మించినట్టుగా ఆయన చెప్పారు.వైఎస్ఆర్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును ప్రారంభించడం  తన అదృష్టంగా ఆయన  పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములిచ్చిన 326 కటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చినట్టుగా సీఎం గుర్తు చేశారు. మరో 150 కుటుంబాలకు నవంబర్ లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.ప్రాజెక్టు కోసం  భూములిచ్చిన రైతులకు సీఎం జగన్ ధన్యవాదాలు చెప్పారు.

Latest Videos

undefined

గతంలో  చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తప్పుడు హామీలు ఇచ్చారన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే చంద్రబాబునాయుడికి  ఈ హామీలు గుర్తుండవని సీఎం  ఎద్దేవా  చేశారు.ఈ ప్రాంతంలోని 16,218 మత్స్యకారేతర కుటుంబాలకు ప్రభుత్వం  రూ.35.74 కోట్ల సహాయం చేసిందని  చెప్పారు.

స్థానికుల  కోసం  ప్రత్యేకంగా  రూ.25 కోట్లతో జెట్టీని నిర్మిస్తున్నట్టుగా సీఎం జగన్  హామీ ఇచ్చారు.ప్రజలకు  మంచి  చేయాలనే ఉద్దేశ్యంతో తమ  ప్రభుత్వం  ముందుకు వెళ్తుందని  సీఎం  జగన్ చెప్పారు.ఈ  ప్రాంత  మత్స్యకారులకు రూ.25 కోట్లతో ప్రత్యేక జెట్టీని ఏర్పాటు చేస్తామన్నారు.
 

click me!