వైఎస్ జగన్ రియల్ హీరో: సినీనటుడు కృష్ణంరాజు

Published : Jun 08, 2019, 03:39 PM IST
వైఎస్ జగన్ రియల్ హీరో: సినీనటుడు కృష్ణంరాజు

సారాంశం

ప్రజల అఖండ అభిమానం చూరగొన్న నాయకుడిగా, పిన్న వయసులోనే ప్రజానేతగా ఎదిగిన జగన్  రాజకీయాలలో రియల్ హీరో అంటూ ప్రశంసించారు. జగన్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనే ధ్యేయంగా ముందడుగు వేస్తారని తాను గట్టిగా విశ్వసిస్తున్నట్లు కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు కేంద్రమాజీ మంత్రి, ప్రముఖ నటుడు కృష్ణంరాజు. వైయస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన జగన్ రాజకీయాల్లో రియల్ హీరో అంటూ కొనియాడారు. 

మంత్రివర్గ విస్తరణలో జగన్ నిర్ణయం సామాజిక విప్లవానికి నాంది గా తాను భావిస్తున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంత్రి మండలి ఏర్పాటు చేశారంటూ అభినందించారు. 

కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించటం అభినందనీయమని కొనియాడారు. ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు కేటాయించడం మీ ఉన్నత నాయకత్వ లక్షణాలకు నిదర్శనమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. 

ఎవరూ ఊహించని విధంగా ఎనిమిది మంది బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం భవిష్యత్తు రాజకీయాలకు మార్గదర్శకంగా భావిస్తున్నట్లు తెలిపారు. పరిణతి చెందిన ప్రజా నాయకుడిగా సీఎం జగన్  స్పీకర్ పదవి బీసీలకు, డిప్యూటీ స్పీకర్ పదవి బ్రాహ్మణులకు కేటాయించడం చాలా మంచి నిర్ణయమన్నారు. 

ప్రజల అఖండ అభిమానం చూరగొన్న నాయకుడిగా, పిన్న వయసులోనే ప్రజానేతగా ఎదిగిన జగన్  రాజకీయాలలో రియల్ హీరో అంటూ ప్రశంసించారు. జగన్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనే ధ్యేయంగా ముందడుగు వేస్తారని తాను గట్టిగా విశ్వసిస్తున్నట్లు కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu