స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం: రమేష్ ఆస్పత్రికి వైఎస్ జగన్ ప్రభుత్వం షాక్

By telugu teamFirst Published Aug 15, 2020, 7:39 AM IST
Highlights

స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించిన రమేష్ ఆస్పత్రికి జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం సంభవించి పది మంది ఆహుతైన విషయం తెలిసిందే.

విజయవాడ: రమేష్ ఆస్పత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదంపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటి ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత జగన్ సర్కార్ రమేష్ ఆస్పత్రికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకుంది. 

కోవిడ్ కేర్ అందించడంలో కేటగిరి-ఏ చికిత్స అందించే ఆస్పత్రిగా ఉన్న రమేష్ ఆస్పత్రి అనుమతులను రద్దు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అవి ఉంటాయని చెప్పారు. 

ఇదిలావుంటే, జాయింట్ కలెక్టర్ నేతృత్వంోలని కమిటీ నివేదికలో పలు కీలకమైన విషయాలు తెలిశాయి. స్వర్ణ ప్యాలెస్ నిర్వహణలో ఆస్పత్రి యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని కమిటీ తేల్చింది. జీవో 77ను ఉల్లంఘించి ఆస్పత్రి యాజమాన్యం ఫీజులు వసూలు చేసినట్లు కూడా తెలిసింది. ఐదుగురు సభ్యుల కమిటీ స్వర్ణ ప్యాలెస్ లో గుర్తించిన లోపాలను తెలియజేస్తూ కలెక్టర్ ఆస్పత్రికి నోటీసులు జారీ చేశారు. 

రూల్ -9 ఏపీ అల్లోపతిక్, ప్రైవేట్ మెడికల్ కేర్ రిజిస్ట్రేషన్, రెగ్యూలేషన్ రూల్స్ ను రమేష్ ఆస్పత్రి పట్టించుకోలేదని నివేదికలో తెలిపారు. ఆస్పత్రి అందించే సేవల రేట్లను ఇంగ్లీషులోనూ తెలుగులోనూ రిసెప్షన్ లో ప్రదర్శించాలి. అదేమీ చేయలేదని కమిటీ తేల్చింది. మెట్రో పాలిటిన్, ఎం-5 హోటళ్లలో అనుమతి లేకుండా కోవిడ్ రోగులను చేర్చుకున్నట్లు వెల్లడించింది. 

డిఎంహెచ్ఓ ఆఫీసు వద్ద ఈఇ నెల 30 లోగా కమిటీ గుర్తించిన విషయాలపై లిఖిత పూర్వకమైన వివరణ ఇవ్వాలని ఆేదసిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాదనలకు న్యాయవాదిని నియమించుకుంటే వారం రోజుల ముందే తెలియజేయాలని ఆదేశించింది. ఆస్పత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను విచారణకు వ్చచే ముందు లేదా అదే తీసుకుని వచ్చి స్వాధీన పరచాలని కమిటీ ఆదేశించింది.

click me!