తొలి జీవో జారీ చేసిన జగన్ సర్కార్: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ప్రారంభం

By Siva KodatiFirst Published May 31, 2019, 1:33 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే వృద్ధాప్య పింఛన్ పెంపు ఫైలుపై తొలి సంతకం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందుకు సంబంధించి జగన్ సర్కార్ తొలి జీవో విడుదల చేసింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే వృద్ధాప్య పింఛన్ పెంపు ఫైలుపై తొలి సంతకం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందుకు సంబంధించి జగన్ సర్కార్ తొలి జీవో విడుదల చేసింది.

దీనిని అనుసరించి జూన్ 1 నుంచి కొత్త పెన్షన్ పథకం అందుతుంది. వైఎస్సార్ పెన్షన్ పథకం కింద వృద్ధుల పెన్షన్ రూ.2,250, వికలాంగులకు రూ.3 వేలు, కిడ్నీ బాధితులకు రూ.10 వేలు చెల్లిస్తారు.

గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ప్రసంగించిన జగన్... వృద్ధాప్య పింఛన్‌ను ఏడాదికి రూ. 250 చొప్పున పెంచుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఏడాది నుంచి రూ.2,250 పింఛను ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. 

click me!