స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో సరదా.. ప్రాణం తీసింది..!

Published : Jun 28, 2021, 10:56 AM ISTUpdated : Jun 28, 2021, 10:58 AM IST
స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో సరదా.. ప్రాణం తీసింది..!

సారాంశం

మృతదేహాల వద్ద కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలతో తీరం మార్మోగింది

స్నేహితుడి పుట్టినరోజు సరదాగా సంతోషంగా గడపాలని అనుకున్నారు. కానీ ఆ సరదానే ప్రాణం తీసింది. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా.. సరాదాగా ఈత కొట్టేందుకు వెళ్లి.. ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన బొర్ర సాయిలోకేష్‌ (20) అనే యువకుడి పుట్టిన రోజు కావడంతో స్నేహితు లు 15 మందితో కలిసి పుక్కళ్లపాలెం తీరానికి ఆదివారం సాయంత్రం వెళ్లారు. అక్కడ కొద్దిసేపు ఆనందంగా గడిపారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. అనంతరం సముద్రంలో స్నానానికి దిగారు. 

ఈత సరదాలో అలలను పసిగట్టలేకపోయారు. ఒక్కసారిగా భారీ కెరటాలు రావడంతో బొర్ర సాయిలోకేష్‌, బొర్ర మనోజ్‌కుమార్‌(20), ఎం.తిరుమల (20), బొర్ర గోపీచంద్‌ (18) అనే నలుగురు యువకులు గల్లంత య్యారు.మిగతా వారు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారమందు కున్న బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్థులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. 

 కొద్దిసేపటికే సాయి లోకేష్‌, మనోజ్‌కుమార్‌, తిరుమల మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. మృతదేహాల వద్ద కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలతో తీరం మార్మోగింది. ఎస్‌ఐ అప్పారావు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. స్థానిక మత్స్యకారుల సాయంతో గోపీచంద్‌ ఆచూకీ కోసంగ గాలింపు చర్యలు చేపడుతున్నారు.  

కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకు న్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అప్పారావు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు