చంద్రబాబు దత్తపుత్రుడు, కామ్రేడ్లకు సమ్మెలు కావాలి.. వాళ్లందరికీ బాబు ఆత్మీయుడు: సీఎం జగన్

Published : Feb 08, 2022, 01:35 PM IST
చంద్రబాబు దత్తపుత్రుడు, కామ్రేడ్లకు సమ్మెలు కావాలి.. వాళ్లందరికీ బాబు ఆత్మీయుడు: సీఎం జగన్

సారాంశం

టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కోసమే రాష్ట్రంలోని కమ్యూనిస్టులు పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. ఎర్ర జెండా వెనక.. పచ్చ జెండా ఉందని విమర్శించారు. చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ ఉన్నవారికే ఆందోళనలు కావాలి అని విమర్శించారు.  


టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కోసమే రాష్ట్రంలోని కమ్యూనిస్టులు పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే ఎల్లోమీడియాకు పండగ అని అన్నారు. సంధి జరిగింది.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం లేదంటే వాళ్లు ఏడుపు మొహం పెట్టుకున్నారని మండిపడ్డారు. సమ్మె విరమించారనే విషయం తెలియగానే కమ్యూనిస్టులను ముందుకు తోశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు, ఎల్లోమీడియాకు మాత్రమే సమ్మె కావాలని ఎద్దేవా చేశారు. జగనన్న చేదోడు (Jagananna Chedodu) పథకం కింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) మంగళవారం లబ్ధిదారుల ఖాతాల్లో రెండో ఏడాది నగదును జమ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేవారు.

ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చాక ఆశావర్కర్లకు జీతం రూ. పదివేలకు పెంచామని తెలిపారు. ఈనాడు రామోజీరావుకు ఈ వాస్తవాలు కనిపించవా? అని ప్రశ్నించారు. ఎర్రజెండాలు, పచ్చజెండాలు కలిపి ఉద్యోగులను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా చంద్రబాబు బినామీ భూముల కోసం కామ్రేడ్లు జెండాలు పట్టుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిలో పేదల ఇళ్లను అడ్డుకున్న వ్యక్తి కామ్రేడ్లకు ఆత్మీయుడుగా మారాడని విమర్శించారు. ఎర్ర జెండా వెనక.. పచ్చ జెండా ఉందని విమర్శించారు. చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ ఉన్నవారికే ఆందోళనలు కావాలి అంటూ ఎద్దేవా చేశారు. 

‘ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న వ్యక్తి ఈనాడుకు ముద్దు బిడ్డ. బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి ఆంధ్రజ్యోతికి ఆత్మీయుడు. బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాసిన చంద్రబాబు ఎర్రజెండాల కామ్రేడ్లకు ఆత్మీయుడు’ అయ్యాడని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. 

’ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ  కోరుకోరు. చంద్రబాబు సీఎం కాలేదనే బాధ, కడుపు మంట ఉన్నవారికే సమ్మెలు కావాలి. చంద్రబాబు దత్తపుత్రుడు, కామ్రేడ్లకు సమ్మెలు కావాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కు సమ్మె కావాలి. ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే వీళ్లకు పండగ. ఆశావర్కర్లు రోడ్ల మీదకు వచ్చారని కథనాలు ప్రచురించారు. మెరుగైన జీతాలు ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రిని తిడితే బాగా కవరేజ్ ఇస్తామని అంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటిని ప్రధాన వార్తలుగా ప్రచురిస్తున్నారు. ఎర్ర జెండా వెనకాల పచ్చ జెండా ఉంది’ అని సీఎం జగన్ విమర్శించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vangalapudi Anitha: మహిళలకు 33% రిజర్వేషన్ హోమ్ మంత్రి అనిత | Asianet News Telugu
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే