నాన్నా.. మీ ఆశయాలే నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి: సీఎం వైఎస్ జగన్

Published : Sep 02, 2023, 11:25 AM IST
నాన్నా.. మీ ఆశయాలే నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి: సీఎం వైఎస్ జగన్

సారాంశం

దివంగత ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ ఆయనకు నివాళులర్పించారు. వైఎస్సార్‌ను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్టు చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ ఆయనకు నివాళులర్పించారు. వైఎస్సార్‌ను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్టు చేశారు. ‘‘నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్‌ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. 

ఇక, వైఎస్సార్‌ వర్దంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట వద్ద కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఈ రోజు ఉదయం వైఎస్సార్ భార్య విజయమ్మ, కూతురు షర్మిల.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.  సీఎం జగన్‌ కూడా వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు వెళ్లి నివాళులు అర్పించనున్నారు. అయితే జగన్, షర్మిలలు వైఎస్సార్ ఘాట్ వద్ద వేర్వేరు సమయాల్లో నివాళులర్పించడం.. మరోసారి రాజకీయంగా  చర్చనీయాంశంగా మారింది.  

PREV
click me!

Recommended Stories

స్వాతంత్య్ర వేడుకల్లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Pawan Kalyan Speech Independence Day 2026
కాకినాడలో జాతీయ జెండా ఎగరేసిన పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Hoists National Flag in Kakinada