నేడు లండన్‌కు సీఎం జగన్ దంపతులు.. పూర్తి వివరాలు ఇవే..

Published : Sep 02, 2023, 11:01 AM IST
 నేడు లండన్‌కు సీఎం జగన్ దంపతులు.. పూర్తి వివరాలు ఇవే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు శనివారం రాత్రి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు శనివారం రాత్రి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ చదువుకుంటున్న తన కుమార్తెలను కలిసేందుకు జగన్, ఆయన సతీమణి భారతీ రెడ్డి లండన్ వెళ్తున్నారు. సీఎం జగన్‌పై ఉన్న కేసుల దృష్ట్యా.. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు వీలుగా బెయిల్ నిబంధనలన సడలించాలనీ సీఎం జగన్ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. కోర్టు వాటిని పక్కన పెడుతూ సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి  ఇచ్చింది. 

దీంతో సీఎం జగన్ దంపతులు లండన్ వెళ్లేందుకు మార్గం సుగమం అయింది. ఇక, ఈ రోజు ఉదయం సీఎం జగన్.. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం ఈ రోజు రాత్రి 9.30 గంటలకు సీఎం జగన్ దంపతులు లండన్ బయలుదేరి వెళ్లనున్నారు. ఇక, సీఎం జగన్ దంపతులు తిరిగి ఈ నెల 11వ తేదీ రాత్రికి వారు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

PREV
click me!

Recommended Stories

Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం
Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu