చంద్రబాబు పెట్టిన వెబ్ సైట్ పేరు మార్చిన జగన్

By telugu teamFirst Published Jul 3, 2019, 5:37 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు తాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫిర్యాదుల స్వీకరణకు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. మీకోసం పేరుతో 2015లో ఆ వెబ్ సైట్ ప్రారంభమైంది.  సమస్యలను, ఫిర్యాదులను ప్రజలు నేరుగా ఈ వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తేవడానికి వీలుంది. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా మిగల్చకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు కనిపిస్తున్నారు. వారానికి ఒకసారి ప్రజల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు ఉండేది. విభజన తర్వాత అది తెలంగాణలో కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు తాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫిర్యాదుల స్వీకరణకు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. మీకోసం పేరుతో 2015లో ఆ వెబ్ సైట్ ప్రారంభమైంది.  సమస్యలను, ఫిర్యాదులను ప్రజలు నేరుగా ఈ వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తేవడానికి వీలుంది. 

అయితే, జగన్ మీకోసం వెబ్ సైట్ పోరు మారుస్తున్నారు. దానికి స్పందన అనే పేరు పెట్టి వినూత్నంగా తయారు చేయడానికి సిద్ధపడ్డారు. ఇటీవల అమరావతిలో కలెక్టర్ల సమావేశం నిర్వహించి స్పందన పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కార తేదీలు కూడా చెప్పాలని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. 

కలెక్టర్ కార్యాలయాల్లోనే కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా దాన్ని అమలు చేయాలని జగన్ చెప్పారు ఈ స్థితిలో మీ కోసం వెబ్ సైట్ ను స్పందన పేరిట కొనసాగించాలని నిర్ణయించారు. స్పందన - ప్రజాసమస్యల పరిష్కార వేదిక పేరిట ఆ వెబ్ సైట్ రూపుదిద్దుకుంటుంది. దీనికి 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ ను అనుసంధానం చేస్తారు. 

స్పందన కోసం కొత్తగా 1800 - 425 - 4440 టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు ఓ మెయిల్ అడ్రస్ ను కూడా కేటాయించారు. ఈ రెండు కూడా మరో వారం, పది రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. ఈ వెబ్ సైట్ లో ఆధార్ నెంబర్ జత చేసి ఫిర్యాదులు చేయడమే కాకుండా ప్రభుత్వానికి సూచలు, సలహాలు కూడా ఇవ్వవచ్చు. 

వెబ్ సైట్ లో ఎవరైనా ఫిర్యాదు చేయగానే మీ ఫిర్యాదు అందినది అనే మెసేజ్ మొబైల్ కు వెళ్తుంది. ఆ సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో కూడా అధికారులు చెబుతారు. అధికారులు చెప్పిన సమయానికి సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ ఫిర్యాదు చేయవచ్చు. 

click me!