జగన్ దాడి కేసు: విజయవాడకు నిందితుడు శ్రీనివాస్

By Nagaraju TFirst Published Jan 11, 2019, 11:03 AM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్  రెడ్డిపై దాడి కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసింది నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ. హైకోర్టు, కేంద్రప్రభుత్వం ఆదేశాలతో జగన్ దాడి కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసే పనిలో పడింది. 
 

విశాఖపట్నం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్  రెడ్డిపై దాడి కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసింది నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ. హైకోర్టు, కేంద్రప్రభుత్వం ఆదేశాలతో జగన్ దాడి కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసే పనిలో పడింది. 

ఒకవైపు ఏపీ సర్కార్ కేసు విచారణకు సహకరించడంలేదని ఆరోపిస్తూనే ఎన్ఐఏ తన పని తాను చేసుకుపోతుంది. ఎన్ఐఏకు సంబంధించి ఏపీలో విజయవాడలో ఒక్కచోట మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం కోర్టు పరిధిలో ఉన్న జగన్ దాడి కేసును విజయవాడకు బదిలీ చేయించుకుంది ఎన్ఐఏ. 

ఎన్ఐఏ ఆదేశాలతో విశాఖపట్నం ఏడో అదనపు మెట్రో పాలిటన్ సెషన్ జడ్జ్ కేసును విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. దీంతో నిందితుడు శ్రీనివాస్‌ను విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు తరలించారు పోలీసులు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న శ్రీనివాస్ ను శుక్రవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు ఎదుట హారుపరిచనున్నారు. 

ఇకపై జగన్ పై దాడికేసు విజయవాడలోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో విచారణ జరుగనుంది.

 

ఈ పరిస్థితుల్లో నిందితుడు శ్రీనివాస్‌ను విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించారు. ఎన్‌ఐఏలోని అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో దర్యాప్తుకు ఈనెల 1 నుంచి విశాఖలో ఉన్న బృందం న్యాయపరమైన చర్యలు పూర్తి చేసింది. 

నిందితుడు జె.శ్రీనివాస్‌ను విశాఖపట్నం కేంద్ర కారాగారం నుంచి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలని జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో విశాఖ నుంచి నిందితుడిని విజయవాడ తరలించారు. కోర్టులో హాజరుపర్చిన అనంతరం తిరిగి విశాఖపట్నం సెంట్రల్ జైల్ కు తరలించనున్నారు.


 ఈ వార్తలు కూడా చదవండి

ఎన్ఐఏకు జగన్‌పై దాడి కేసు: హైకోర్టులో బాబు సర్కార్ పిటిషన్

click me!