ఏపీ ఉద్యోగులకు 23. 29 శాతం ఫిట్ మెంట్ ఇవ్వనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో ఇవాళ నిర్వహించిన సమావేశంలో 23.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ 23.25 శాతం ఫిట్‌మెంట్ ను ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో శుక్రవారం నాడు సీఎం జగన్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో 23.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని జగన్ ప్రకటించారు.
శుక్రవారం నాడు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం Ys Jagan భేటీ అయ్యారు.ఈ సమావేశానికి ముందే ఏపీ సీఎం జగన్ ఆర్ధిక శాఖాధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచారు.
నిన్ననే ఉద్యోగ సంఘాల నేతలతో జగన్ చర్చించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన అభిప్రాయాలను సీఎం నోట్ చేసుకొన్నారు. ఇవాళ మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి Prc ఫిట్‌మెంట్ 23.29 శాతం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఏపీలో ఉద్యోగుల Retirement వయస్సు 60 నుండి 62 శాతానికి పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఈ ఏడాది జూన్ 30 లోపుగా కారుణ్య నియామకాలను చేపడుతామని సీఎం హామీ ఇచ్చారు. పెంచిన జీతాలను ఈ నెల నుండి అమల్లోకి వస్తాయని సీఎం హామీ ఇచ్చారు.2020 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ అమలు చేస్తామని కూడా సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారానికి సీఎస్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా సీఎం జగన్ చెప్పారు. రెండు వారాల్లో employees సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని జగన్ స్పష్టం చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ జూన్ 30 లోపుగా ప్రోబేషణ్ కన్‌ఫర్మేషన్ ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జూలై నుంి రెగ్యులర్ పే స్కేల్ కూడా అందిస్తామని ప్రకటించింది.స్వంత ఇల్లు ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న స్వామర్ట్ టౌన్ షిప్ లో ఎంఐజీ లేఔట్లలో 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేస్తామని కూడా సీఎం హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా ఆలోచించాలని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలను గురువారం నాటి సమావేశంలో కోరారు. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నానని సీఎం తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు 45 నుండి 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఈ సమావేశంలో కోరినట్టుగా సమాచారం. అయితే 23.29 శాతం ఫిట్‌మెంట్ కి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి.
పెండింగ్ డిఎలను కూడా ఒకేసారి ఇచ్చేందుకు సీఎం ప్రకటన చేయడంతో 23.29 శాతం ఫిట్‌మెంట్ కి ఉద్యోగ సంఘాలు అంగీకారం తెలిపాయి.అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్టుగా కాకుండా ఆర్ధిక శాఖ అధికారులు ప్రతిపాదించినట్టుగా కాకుండా మధ్య మార్గంగా ఫిట్‌మెంట్ ను జగన్ ప్రతిపాదించారు.ఈ మేరకు నిన్నటి నుండి కసరత్తు చేశారు. ఇవాళ ఉద్యోగ సంఘాల సమావేశంలో 23.29 శాతం ఫిట్‌మెంట్ ను జగన్ ప్రతిపాదించారు.నెల రోజులుగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీని అంశం ఇవాళ్టితో కొలికి వచ్చింది. ఉద్యోగ సంఘాలు తొలుత డిమాండ్ చేసినట్టుగా కాకుండా కొంత పీఆర్సీ ఫిట్‌మెంట్ తగ్గినా ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి