పోటీకి చంద్రబాబు, వైఎస్ జగన్ ఫ్యామిలీలు రెడీ

First Published Feb 26, 2019, 1:55 PM IST

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో కొన్ని కుటుంబాలపోటీపై సర్వత్రా ఊహాగానాలు వినిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి సంబంధించి నలుగురు పోటీ చెయ్యడం సహజంగా వస్తోంది. 

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో కొన్ని కుటుంబాలపోటీపై సర్వత్రా ఊహాగానాలు వినిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి సంబంధించి నలుగురు పోటీ చెయ్యడం సహజంగా వస్తోంది.
undefined
తెలంగాణ సీఎం కేసీఆర్, తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, కుమార్తె కవిత పోటీ చేస్తారు. ఇకపోతే ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కుటుంబం, వైఎస్ కుటుంబం కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే పోటీ చేసేవారు.
undefined
అయితే గత ఎన్నికల్లో ఆయన బావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు, బాలకృష్ణలతోపాటు నారా లోకేష్ కూడా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుటుంబం నుంచి ముగ్గురు బరిలో ఉన్నారన్నమాట.
undefined
అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో వైఎస్ కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేశారు. ఆయన తల్లి వైఎస్ విజయమ్మ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు.
undefined
అలాగే కడప ఎంపీగా వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేశారు. ఇకపోతే కమలాపురం నుంచి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేశారు. మరోవైపు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఐదుగురులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాత్రమే పరాజయం పాలయ్యారు.
undefined
మిగిలిన నలుగురు భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేస్తారన్నదానిపై సందేహం నెలకొంది. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత తిరిగి పులివెందుల నుంచి బరిలో దిగనున్నారు. కమలాపురం ఎమ్మెల్యేగా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తిరిగి పోటీ చెయ్యనున్నట్లు తెలుస్తోంది.
undefined
అలాగే కడప పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి తిరిగి పోటీ చెయ్యనున్నారు. ఇకపోతే వైఎస్ జగన్ తల్లి వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని స్పష్టం చేశారు.
undefined
అలాగే ఒంగోలు ఎంపీగా వైఎస్ జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి పోటీపై సందిగ్ధత నెలకొంది. ఈసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం ఇవ్వరని తెలుస్తోంది. మాగుంట సుబ్బారెడ్డి లేదా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎంపీ శ్రీనివాసుల రెడ్డి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డిని పార్టీకే పరిమితం చెయ్యాలని జగన్ చూస్తున్నారని తెలుస్తోంది. అయితే వైవీ సుబ్బారెడ్డి మాత్రం తానే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఓడిపోయిన వాళ్లకు టికెట్లు ఎందుకన్నారు. తాను పోటీ చెయ్యడం లేదని ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
undefined
ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుటుంబం నుంచి పోటీ చేసేందుకు ఒకరు పెరగగా...వైఎస్ కుటుంబం నుంచి మాత్రం ఒకరు వెనక్కి తగ్గారు. అయితే మెుత్తానికి వైఎస్ కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేస్తారా అన్న విషయంపై వైఎస్ జగన్ రెండురోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
undefined
click me!