తరుపు ముక్క: వైఎస్ షర్మిల మనస్తాపం, పొలిటికల్ ఎంట్రీపై డౌట్స్

First Published Feb 26, 2019, 12:12 PM IST

తరుపు ముక్క: వైఎస్ షర్మిల మనస్తాపం, పొలిటికల్ ఎంట్రీపై డౌట్స్

అయితే ప్రతిపక్ష పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుందా అనేది అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఈ సమయానికి వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిందనే చెప్పాలి. ఒకవైపు వైఎస్ జగన్ వదిలిని బాణంగా వైఎస్ షర్మిళ, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలు పర్యటనలతో తెలుగుదేశం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశారు.
undefined
అయితే ఈ ఎన్నికలకు సంబంధించి వైఎస్ విజయమ్మ గానీ వైఎస్ షర్మిల కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఒక్కరే పాల్గొంటారా లేక వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల కూడా పాల్గొంటారా అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో కూడా వీరిద్దరూ కనిపించలేదు. ఈ నేపథ్యంలో వారిని వైఎస్ జగన్ ఇంటికి పరిమితం చేశారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
undefined
వైఎస్ షర్మిళపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా జరిగిన ప్రచారంపై ఆమె ఇప్పటికీ తేరుకోలేదని తెలుస్తోంది. ఆమె తనపై వచ్చిన తప్పుడు ప్రచారంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారని అందువల్ల ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
undefined
ఇకపోతే వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైఎస్ జగన్ మాత్రం ఇప్పటికే ప్రజా సంకల్పయాత్ర పేరుతో ప్రజలతోనే ఉన్నామని ఫలితంగా తాను ఒక్కర్నే ప్రచారం నిర్వహిస్తే సరిపోతుందన్న ధీమాలో ఉన్నారట వైఎస్ జగన్
undefined
అయితే పార్టీలోని పెద్దలు మాత్రం వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలను ఎన్నికల ప్రచారంలో దింపాల్సిందేనని కోరుతున్నారట. మహిళల ఓట్లను కొల్లగొట్టాలన్నా, క్రైస్తవ ఓట్లను కొల్లగొట్టాలన్నా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ ఎన్నికల సమరంలో కీలక పాత్ర పోషించాల్సిందేనని చెప్తున్నారట
undefined
ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ మహిళా ఓట్లకు భారీగానే గాలం వేసింది. పసుపు-కుంకుమ పథకం పేరుతో డ్వాక్రా గ్రూపులో ఉన్నటు వంటి ఒక్కో సభ్యురాలిగా రూ.10వేలు ఇచ్చింది. ఈ పదివేల రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. మరోవైపు ఉచితంగా సెల్ ఫోన్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. అలాగే వృద్ధాప్య పింఛన్ రూ.2000కు పెంచారు
undefined
పసుపు కుంకుమ పథకం వల్ల దాదాపు 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు లబ్ధి పొందనున్నారు. ఫలితంగా చంద్రబాబు నాయుడు 90 లక్షల మందిలో కొంతమందిని అయినా ప్రభావితం చెయ్యగలమని ధీమాతో ఉన్నారట. అలాగే వృద్ధాప్య పింఛన్ వల్ల లక్షలాది మంది మహిళలు వృద్ధులు కూడా టీడీపీ వైపు సానుభూతిగా ఉన్నారని తెలుస్తోంది. పసుపు కుంకుమ పథకం కింద రూ.10వేలు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మహిళా ఓటర్ల కాస్త సానుకూలంగా మారారంటూ ప్రచారం జరుగుతోంది
undefined
ఈ నేపథ్యంలో ఆ ఓటర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించాలంటే సెంటిమెంట్ ను అస్త్రంగా ప్రయోగించాలని పార్టీ పెద్దలు నిర్ణయిస్తున్నారట. వైఎస్ షర్మిలను రంగంలోకి దించితే మహిళా ఓటర్లను ఆకట్టుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టారు వైఎస్ షర్మిల.
undefined
అయితే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. బిడ్డ కష్టపడింది, పాదయాత్ర చేసినా ఫలితం రాలేదని ఈసారి షర్మిల ముఖం చూసి ఈ సారైనా ఓటేద్దాం అని కొంతమంది మనసు మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
undefined
మరోవైపు వైఎస్ విజయమ్మ సైతం సెంటిమెంట్ తో ఓటర్లను ఆకట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి జరిగిన ఘటనలో అధికార తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ పై సానుభూతి చూపించాల్సింది పోయి కోడికత్తి డ్రామా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఒక్కసారిగా వైఎస్ విజయమ్మ మీడియా ముందుకు రావడంతో ఎవరూ నోరు మెుదపలేని పరిస్థితి
undefined
ఇకపోతే వైఎస్ విజయమ్మ గతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రైస్తవ సోదరుల ఓట్లు గంపగుత్తగా పడతాయని ప్రచారం. అయితే కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ పేరుతో క్రైస్తవ ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ఓటర్లను కొల్లగొట్టాలంటే వైఎస్ విజయమ్మను బరిలోకి దించాల్సిందేనని ప్రచారం జరుగుతోంది.
undefined
ఇంకాస్త ముందుకెళ్తే కే ఏ పాల్ ను చంద్రబాబు నాయుడే రంగంలోకి దించారని క్రైస్తవ ఓటర్లను వైసీపీకి దూరం చెయ్యడమే లక్ష్యమంటూ ప్రచారం కూడా జరగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను ఎన్నికల ప్రచారంలోకి దించితే బాగుంటుందని ప్రచారం కూడా జరుగుతుంది
undefined
బస్సుయాత్ర అంతా వైఎస్ షర్మిలతోనే కొనసాగించాలని కోరుతున్నారు. ఇకపోతే వైఎస్ జగన్ సమర శంఖారావం, అన్న పిలుపు పేరుతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక చెయ్యాల్సిన పరిస్థితి ఉండటంతో వైఎస్ షర్మిలతోనే బస్సుయాత్ర చేపట్టాలన్న వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది.
undefined
అలా కానీ నేపథ్యంలో వైఎస్ షర్మిలను గుంటూరు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో అయినా షర్మిలను ప్రచారం చేయించాలని కోరుతున్నారు. అటు భారతిని కడప, అనంతపురం జిల్లాలలో అయినా ప్రచారం చేయించాలని సూచిస్తున్నారు.
undefined
అయితే వైఎస్ జగన్ లండన్ పర్యటన నుంచి హైదరాబాద్ చేరుకోవడంతో ఇక ఎన్నికల ప్రచారంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ అందర్నీ ఆకట్టుకున్న షర్మిల ఈ ఎన్నికల ప్రచారంలో బాణంలా దూసుకుపోతారా లేక ఇంటికే పరిమితమవుతారా అన్నది వేచి చూడాలి
undefined
విజయవాడ: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి దాదాపు శ్రీకారం చుట్టినట్లేనని చెప్పుకోవాలి. పరోక్షంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేశారు. దాదాపు 10 మంది ఎంపీ అభ్యర్థులు, 70 మంది అసెంబ్లీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు
undefined
click me!