తన ప్రేమకు అడ్డుగా ఉన్నారని.. సొంత ఇంటికే నిప్పు

Published : Jul 02, 2019, 10:06 AM IST
తన ప్రేమకు అడ్డుగా ఉన్నారని.. సొంత ఇంటికే నిప్పు

సారాంశం

తన ప్రేమను ఇంట్లో వాళ్లు కాదంటున్నారని సొంత వారిపైనే కక్ష పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డుగా ఉన్నవారిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. 

తన ప్రేమను ఇంట్లో వాళ్లు కాదంటున్నారని సొంత వారిపైనే కక్ష పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డుగా ఉన్నవారిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో సొంత ఇంటికే నిప్పు పెట్టాడు. కాగా.. కుటుంబసభ్యులు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... తన ప్రేమ వ్యవహరంలో కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారని భావించిన వంశీకృష్ణ అనే యువకుడు పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజ్‌తో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వంశీకృష్ణను అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu