యువతిని వివస్త్రగా మార్చి.. దారుణం

Published : Aug 14, 2020, 02:20 PM IST
యువతిని వివస్త్రగా మార్చి.. దారుణం

సారాంశం

ఆ ప్రాంతంలో ఎందుకు ఉందో అనుకుంటూ.. అనుమానాం వచ్చి చూడగా ఆరుగురు యువకులు కలిసి  ఓ యువతిని వివస్త్రను చేసి దుస్తులు లాక్కొని ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు.

దేశంలో రోజు రోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి. ఆడ పిల్లలకు కనీసం రక్షణ కూడా లభించడం లేదు. తాజాగా.. కొందరు మృగాళ్లు.. యువతి పట్ల దారుణంగా ప్రవర్తించారు. వివస్త్రను చేసి దుస్తులు ఇవ్వకుండా వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఈ అమానుషసంఘటన నెల్లూరు నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహమూర్ మసీదు వెనుక గొర్రెల మండీ ఉంది. దీని పక్కన నిర్మానుష్యంగా ఉండటంతో చీకటి కార్యకలాపాలకు వేదికగా మారింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఓ గొర్రెల కాపరి అటువైపుగా వెళుతుండగా ఓ ఆటో నిలిపి ఉంది. ఆ ప్రాంతంలో ఎందుకు ఉందో అనుకుంటూ.. అనుమానాం వచ్చి చూడగా ఆరుగురు యువకులు కలిసి  ఓ యువతిని వివస్త్రను చేసి దుస్తులు లాక్కొని ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు.

దీంతో ఆ వ్యక్తి వెంటనే.. తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ అటు వేయగా.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆటో వెనుక ఓ సినిమా నటుడి స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. గొర్రెల కాపరి.. వెంటనే యువతికి దుస్తులు ఇవ్వడంతో.. వాటిని వేసుకొని ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే.. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu