
కొడుకు తప్పు చేస్తుంటే సరిదిద్దాల్సిన తల్లే.. పెడదారి పట్టింది. కొడుకు చేస్తున్న తప్పుకి ఆమె పూర్తిగా సహకరించింది. ఓ ఆడపిల్ల జీవితాన్ని స్వయంగా తన చేతులతో నాశనం చేసింది. కొడుకు ఓ మైనర్ బాలికపై కన్నేస్తే.. అతనికి ఆ విషయంలో సహకరించింది. బాలికను ఆమె తీసుకువచ్చి బలవంతంగా కొడుకు గదిలోకి పింపింది. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా వినుకొండలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వినుకొండకు చెందిన మాదవరపు గోపినాథ్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. ఇదే విషయాన్ని కన్న తల్లికి చెప్పగా.. ఆమె తప్పు అని వారించాల్సింది పోయి.. పూర్తిగా సహకరించింది. తన తల్లి ప్రోద్బలంతో ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మాదవరపు గోపినాథ్ వయసు 22ఏళ్లు కాగా.. సదరు బాధిత బాలిక 9వ తరగతి చదువుతోంది.బలవంతంగా బాలికను తన ఇంటికి తీసుకువచ్చి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ హెచ్చరించారు. కాగా.. బాధితురాలు తన కటుంబసభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. అయితే, గోపినాథ్ తల్లే బాధిత బాలికను బలవంతంగా గదిలోకి పంపినట్లు బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదు ఆధారంగా నిందితుడు గోపినాథ్, అతని తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.