
ఓ వివాహితపై సమీప బంధువే అత్యాచారానికి పాల్పడ్డాడు. అవ్వ చనిపోయిందని అబద్ధం చెప్పి...గ్రామానికి తీసుకువెళతానని నమ్మించి మార్గ మధ్యంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... నిమ్మనపల్లె మండలానికి చెందిన ఓ యువతికి ఏడాది కిందట వివాహమైంది. ఆమెకు సమీప బంధువైన మహేష్(20)అనే యువకుడు, అతని స్నేహితులు విజయ్, శివ రెండురోజుల కిందట గ్రామ సమీపంలో చీపురుపుల్ల లు కోసుకుంటున్న మహిళ వద్దకు వచ్చారు. అ వ్వ చనిపోయిందని చెప్పడంతో నమ్మిన ఆమె మహేష్ తో కలసి ద్విచక్రవాహనంపై ఊరికి బయల్దేరింది.
మార్గమధ్యలో నిర్మానుష్య ప్రదేశం వైపు ద్విచక్ర వాహనం మళ్లించి మహేష్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఆమెను బోయకొండ సమీపంలోని రెండవ ఆర్చి వద్ద వదిలేసి వెళ్లిపోయారు.
దిక్కుతోచ ని స్థితిలో ఆమె రాత్రంతా అక్కడే ఉండి సోమవారం ఉదయం ఇంటికి చే రుకుంది. మంగళవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ సహదేవి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.