పొట్టిశ్రీరాములు విగ్రహానికి అవమానం.. వీడియో వైరల్

Published : Dec 26, 2018, 10:38 AM IST
పొట్టిశ్రీరాములు విగ్రహానికి అవమానం.. వీడియో వైరల్

సారాంశం

ఓ యువకుడు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అవమానించేలా ప్రవర్తించి.. దానిని వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు.

ప్రకాశం జిల్లాలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవమానం జరిగింది. ఓ యువకుడు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అవమానించేలా ప్రవర్తించి.. దానిని వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. కాగా.. ఆ వీడియో చూసిన పోలీసులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు యువకుడిపై మండిపడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఆటో డ్రైవర్ కోటపాటి రవి, డిగ్రీ విద్యార్థి హరికృష్ణ నవంబర్ 7వ తేదీన ఫుల్ గా మద్యం సేవించారు. అనంతరం అర్థరాత్రి సమయంలో పట్టణంలోని రేడియో  బావి ైెసంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్నారు.

మద్యం మత్తులో రవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కౌగిలించుకొని..చెంపలపై కొడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.దానిని హరికృష్ణ వీడియో తీసి..యూట్యూబ్ లో పోస్టు చేశాడు. ఆ వీడియోని చూసిన వారి మిత్రులు అలా చేయడం తప్పు అని వారించారు. దీంతో.. మరోసారి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు వెళ్లి.. పూలమాల వేసి క్షమాపణలు చెప్పారు.

ఆ వీడియోని కూడా.. యూట్యూబ్ లో పోస్టు చేశారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. గమనించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Prashna Ravan Controversy: నోరుంది కదా అని వాగితే...రావణ్ గతే పట్టుద్ది | Asianet News Telugu
Strong Wind Alert : వాయుగుండం కాదిది వాయు'గండం'.. ప్రచండ గాలులతో ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే