గుంటూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. తండ్రి, కొడుకులు దుర్మరణం

sivanagaprasad kodati |  
Published : Dec 26, 2018, 09:30 AM IST
గుంటూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. తండ్రి, కొడుకులు దుర్మరణం

సారాంశం

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బేతంపూడి బిపిన్, ఆయన భార్య చైతన్య, తండ్రి పరంజ్యోతితో పాటు కుమారుడు, కుమార్తెతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి తెనాలి వస్తున్నారు.

ఈ క్రమంలో తెల్లవారుజామున గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద ముందు వెళుతున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బిపిన్, పరంజ్యోతిలు అక్కడికక్కడే మరణించగా.. చైతన్య పిడుగురాళ్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ
IMD Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఏయే జిల్లాల్లో అంటే?