ప్రేమ పేరిట యువతి మోసం.. యువకుడు ఆత్మహత్య

Published : Jun 27, 2020, 02:02 PM ISTUpdated : Jun 27, 2020, 02:05 PM IST
ప్రేమ పేరిట యువతి మోసం.. యువకుడు ఆత్మహత్య

సారాంశం

. తన చావుకు కారణమైన వారిని శిక్షించాలని కోరారు. రికార్డు చేసిన వీడియోని బంధువులకు పంపి అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు

తాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి.. తనను మోసం చేసిందని ఓ యువకుడు తట్టుకోలేకపోయాడు. తన చావుకు ప్రేమించిన యువతితో పాటు మరో స్నేహితుడు కారణమంటూ సెల్ఫీ వీడియో తీసి అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మూడు రోజుల క్రితం చోటు చేసుకోగా, ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. 

మృతుడుని జక్కంపూడి కనకారావుగా గుర్తించారు. ప్రేమ పేరుతో  యువతి చేసిన మోసాన్ని భరించలేక సూసైడ్‌ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తన చావుకు కారణమైన వారిని శిక్షించాలని కోరారు. రికార్డు చేసిన వీడియోని బంధువులకు పంపి అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న భీమవరం రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works