లవర్స్ మధ్య కోడిపకోడి చిచ్చు.... ప్రియుడు ఆత్మహత్య

Published : Aug 21, 2019, 09:54 AM ISTUpdated : Aug 21, 2019, 10:05 AM IST
లవర్స్ మధ్య కోడిపకోడి చిచ్చు.... ప్రియుడు ఆత్మహత్య

సారాంశం

ఆ రోజు రాత్రి ఫూటుగా మద్యం తాగిన శ్రీను ఆమెను కోడిపకోడి తినమని బతిమాలుతూ పలుమార్లు తినిపించే యత్నం చేశాడు.దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆమెతో వివాదానికి దిగాడు. 

ప్రేమికుల మధ్య కోడి పకోడి చిచ్చు రేపింది. ప్రియుడు ఎంతో ప్రేమగా... కోడి పకోడి తీసుకువస్తే... ప్రియురాలు తినలేదు. దీంతో... మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ధనియాల పేటకు చెందిన తెర్లి శ్రీను(25) అదే ప్రాంతానికి చెందిన వివాహితతో కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీను, ఆమె ఈనెల 19న మచిలీపట్నం వెళ్లివచ్చారు. అక్కడి నుంచి వస్తూ శ్రీను మద్యం, కోడిపకోడి తెచ్చుకున్నాడు. ఆ రోజు రాత్రి ఫూటుగా మద్యం తాగిన శ్రీను ఆమెను కోడిపకోడి తినమని బతిమాలుతూ పలుమార్లు తినిపించే యత్నం చేశాడు.
 
దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆమెతో వివాదానికి దిగాడు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఆమె తన పాపను స్కూలు వద్ద దించి వచ్చే సమయానికి శ్రీను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే