మైనర్ బాలికతో సహజీవనం.. గర్భం రావడంతో...

Published : Dec 08, 2018, 02:10 PM IST
మైనర్ బాలికతో సహజీవనం.. గర్భం రావడంతో...

సారాంశం

బంధువునంటూ మాట కలిపాడు. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. అనంతరం మాయచేసి అబార్షన్ చేయించాడు.

బంధువునంటూ మాట కలిపాడు. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. అనంతరం మాయచేసి అబార్షన్ చేయించాడు.ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలోని నూతలపాడు గ్రా మానికి చెందిన ఓ బాలిక రెండేళ్ల క్రితం పోతుకట్లలో జరిగిన తిరునాళ్లకు వెళ్లింది. అక్కడ పోతుకట్ల గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఆమెను కలిశాడు. బంధువునంటూ పరిచయం చేసుకున్నాడు. ఆతర్వాత వారి మధ్య పరిచయం ప్రేమ గా మారింది.

 అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికపై ఆ యువకుడు లైంగిక దాడి చేశాడు. అప్పటి నుంచి ఆమెతో పలుసార్లు శారీరకంగా కలిశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోవాలని అతడిని నిలదీయగా సరేనని చెప్పి మందులు ఇప్పించి గర్భంపోయేలా చేశాడు. ఆతర్వాత పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. 

ఈమేరకు ఆ బాలిక ఈనెల 4వతేదీన పర్చూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె వయసు 18 సంవత్సరాలున్నప్పటికీ 16వ ఏట నుంచే లైంగికదాడి జరగినట్లు తేలింది. దీంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu