నెల్లూరులో కారు భీభత్సం... ఆరుగురికి తీవ్ర గాయాలు

Published : Dec 08, 2018, 01:58 PM ISTUpdated : Dec 08, 2018, 02:21 PM IST
నెల్లూరులో కారు భీభత్సం... ఆరుగురికి తీవ్ర గాయాలు

సారాంశం

నెల్లూరు పట్టణంలో ఓ కారు నడిరోడ్డుపై భీభత్సం సృష్టించింది. మధ్యం సేవించి కారు డ్రైవ్ చేసిన ఓ వ్యక్తి పట్టణంలోని ట్రంక్ రోడ్డుపై భారీ ప్రమాదానికి కారణమయ్యాడు. కారు అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది. 

పాదచారులను ఢీ కొట్టిన తర్వాత కూడా ఆగకుండా దూసుకెళ్ళిన కారు ఓ ఆటోను కూడా ఢీకొట్టింది. అయితే కొందరు స్థానికులు కారు డ్రైవర్ ను పట్టుకోడానికి ప్రయత్నించగా అతడు పరారైనట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో ఆరుగురు పాదచారులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు స్వల్పంగా గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారందరు ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారు అగర్వాల్ ఐ ఆస్పత్రి డాక్టర్  శివ ప్రతాప్ రెడ్డి కి చెందినదిగా గుర్తించారు. అయితే ప్రమాద సమయంలో కారును నడిపింది ఎవరని తెలుసుకోడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Inspirational Speech About Dr BR Ambedkar and Abdul Kalaam | Asianet Telugu
తిరుమల మెట్లెక్కిన 116ఏళ్ల బామ్మకి VIP బ్రేక్ దర్శనం | Asianet News Telugu