చంద్రబాబుపై సంచలన పోస్టులు: యువకుడి అరెస్టు

By pratap reddyFirst Published Nov 3, 2018, 10:34 AM IST
Highlights

రాజారెడ్డి గత నెల 26వ తేదీన అంజిరెడ్డి పేరిట ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి చంద్రబాబు ఆకస్మిక మరణం అని పోస్ట్ పెట్టాడు. దీనికి సంబంధించి మార్ఫింగ్‌ ఫొటోను కూడా పెట్టాడు. మరో పోస్టులో ఎన్టీఆర్‌, జగన్‌లను చంద్రబాబు కత్తితో పొడుస్తున్నట్లు వెన్నుపోటు బాబు అని ఉన్న ఫొటో అప్‌లోడ్‌ చేశాడు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై దారుణమైన వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన రాజారెడ్డి అనే యువకుడిని గుంటూరు జిల్లా మంగళగిరి సైబర్‌క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గుంటూరులోని ఆరవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరచారు. కోర్టు అతనికి రిమాండ్‌ విధించింది. రాజారెడ్డిని జిల్లా జైలుకు తరలించారు. 

రాజారెడ్డి గత నెల 26వ తేదీన అంజిరెడ్డి పేరిట ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి చంద్రబాబు ఆకస్మిక మరణం అని పోస్ట్ పెట్టాడు. దీనికి సంబంధించి మార్ఫింగ్‌ ఫొటోను కూడా పెట్టాడు. మరో పోస్టులో ఎన్టీఆర్‌, జగన్‌లను చంద్రబాబు కత్తితో పొడుస్తున్నట్లు వెన్నుపోటు బాబు అని ఉన్న ఫొటో అప్‌లోడ్‌ చేశాడు.
 
ఫణీంద్రరెడ్డి అనే యువకుడు వాటిని షేర్‌ చేశాడు. ఇవి సోషల్‌ మీడియాలో సందడి చేశాయి. దీంతో టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి చిట్టాబత్తిని శ్రీనివాసరావు, మైనార్టీ సెల్‌ నాయకుడు మీరావలి అదే రోజు రాత్రి మంగళగిరిలోని సైబర్‌ క్రైం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 దీనిపై దర్యాప్తు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అనంతపురం జిల్లా పాట్రపల్లి గ్రామానికి చెందిన జూటూరు రాజారెడ్డి అనే యువకుడు అంజిరెడ్డి పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచి పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. 

click me!