చికెన్ పెట్టి ప్రేమలోకి దించాడు: గర్భం దాల్చాక జంప్

Published : Mar 03, 2020, 03:59 PM ISTUpdated : Mar 03, 2020, 05:56 PM IST
చికెన్ పెట్టి ప్రేమలోకి దించాడు: గర్భం దాల్చాక జంప్

సారాంశం

ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకొన్న యువకుడు తాను గర్భం దాల్చినట్టుగా తెలిసిన తర్వాత చెప్పా పెట్టకుండా పారిపోయినట్టుగా వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన  గుంటూరు జిల్లాలో చోటు చేసుకొంది. 


గుంటూరు: చికెన్ ముక్కలు పెట్టి ప్రేమలోకి దించాడని  ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. కుటుంబసభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకొని గర్భవతినని తెలిసిన తర్వాత  తప్పిచుకు తిరుగుతున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Also read:గుంటూరులో రివర్స్: పెళ్లికి యువకుడికి యువతి వేధింపులు, ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన  ఓ యువతి ఏడో తరగతి వరకు చదువుకొంది. తండ్రి దివ్యాంగుడు. కుటుంబ పరిస్థితుల కారణాలతో ఆమె చదువును ఆపేసింది.

ఆడవారి అలంకరణ వస్తువులను నాలుగు చక్రాల బండిపై పెట్టి విక్రయించేది.  ఈమె బండి పక్కనే  చికెన్ పకోడిని  ఓ యువకుడు విక్రయించేవాడు. ప్రతి రోజూ ఇద్దరూ పక్క పక్కనే వ్యాపారం నిర్వహించేవారు. దీంతో ఇద్దరి మధ్య  పరిచయం ఏర్పడింది.యువతికి చికెన్ వ్యాపారం నిర్వహించే యువకుడు  ఆ యువతికి చికెన్ పెడుతూ నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఆమెను ప్రేమలోకి దింపాడు. 

నీవు లేకపోతే చనిపోతానని ఆ యువకుడు ఆ యువతికి తేల్చి చెప్పాడు. దీంతో  ఆ యువతి ఆ యువకుడి మాటలను నమ్మింది. కుటుంబసభ్యులకు తెలియకుండానే యువకుడిని పెళ్లి చేసుకొంది.

రెండు మాసాలపాటు వీరిద్దరూ గదిని అద్దెకు తీసుకొని  వేరు కాపురం పెట్టారు. యువతి గర్భం దాల్చింది. అప్పులు ఉన్నాయని చెప్పి రెండు మాసాల తర్వాత తన వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులను తీసుకొని పారిపోయినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తకు మరో పెళ్లి చేసేందుకు తన అత్త ప్రయత్నాలు చేస్తోందని బాధితురాలు ఆరోపిస్తోంది. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్