
ఏలూరు జిల్లా నూజివీడులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువతీయువకులు వేర్వురుగా విషం తాగారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. నూజివీడులోని స్టేషన్‌తోటకు చెందిన మేకల రాణి అదే ప్రాంతానికి చెందిన కొండా ప్రదీప్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు ఒకరితోఒకరు కలవద్దని ఆంక్షలు విధించారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన యువతి కుటుంబ సభ్యులు ఆమెను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో యువతి మరణించింది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ప్రదీప్ కూడా విషం తాడి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.