గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయం చేసింది.. మంత్రి రోజా ఫైర్

Published : Sep 07, 2022, 12:52 PM IST
గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయం చేసింది.. మంత్రి రోజా ఫైర్

సారాంశం

రాష్ట్రానికి అవసరం లేని విషయాలపై టీడీపీ రాజకీయం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నెల రోజులు రాజకీయం చేసిందన్నారు. 

రాష్ట్రానికి అవసరం లేని విషయాలపై టీడీపీ రాజకీయం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. మంత్రి రోజా బుధవారం గుంటూరు జిల్లాలో ఓ వినాయక మండపంలో జరిగిన పూజలో పాల్గొన్నారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో వైసీపీ అభిమానులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పారు. ఇక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. రాబోయే 2024లో కూడా ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలో రావాలని వారు బలంగా  కోరుకుంటున్నారని చెప్పారు. 

ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నెల రోజులు రాజకీయం చేసిందన్నారు. మాధవ్ తప్పు చేశాడా? లేదా? అన్నది దేవుడు చూసుకుంటాడని చెప్పారు. తప్పు చేసిన వ్యక్తులు ఎన్నో రోజులు తప్పించుకోలేరని అన్నారు. అన్న క్యాంటీన్‌ల విషయంలో టీడీపీ అనవసర రాద్దాంతం  చేస్తుందని మండిపడ్డారు. నిజంగా ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే 2014లో గెలిచిన తర్వాతే టీడీపీ ఎందుకు అన్న క్యాంటీన్లను పెట్టలేదని ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu