యర్రగొండపాలెం రాజకీయాలు :
యర్రగొండపాలెంలో ముచ్చటగా రెండోసారి కూడా వైసిపి అభ్యర్ధిని మార్చింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ తరపున యర్రగొండపాలెంలో పోటీచేసి గెలిచారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో వైఎస్ జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి కొత్తపార్టీ పెట్టారు. దీంతో సురేష్ కూడా జగన్ వెంటే నడిచి వైసిపిలో చేరిపోయారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సురేష్ ను యర్రగొండపాలెం నుండి కాకుండా సంతనూతలపాడు బరిలో దింపింది వైసిపి. 2019 లో మళ్లీ ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెంకు మారారు. ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రిపదవి పొందారు.
అయితే మళ్లీ ఏమయ్యిందో తెలీదు ఆదిమూలపు సురేష్ ను యర్రగొండపాలెం నుండి మార్చేసారు అధినేత వైఎస్ జగన్. ఈసారి సురేష్ ను కొండెపి బరిలో నిలిపి తాటిపర్తి చంద్రశేఖర్ ను యర్రగొండపాలెం నుండి పోటీ చేయిస్తోంది.
ఇక టిడిపి కూడా కొత్త అభ్యర్థిని యర్రగొండపాలెం పోటీలో నిలిపింది. మొదటిసారి ఎరిక్సన్ బాబు యర్రగొండపాలెం బరిలో నిలిచారు. ఇలా ఇరుపార్టీలు కొత్త అభ్యర్థులను బరిలోకి దింపడంతో యర్రగొండపాలెం పోరు ఆసక్తికరంగా మారింది.
యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. పుల్లలచెరువు
2. త్రిపురాంతకం
3. యర్రగొండపాలెం
4. దోర్నాల
5. పెద అరవీడు
యర్రగొండపాలెం అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,00,581
పురుషులు - 1,01,739
మహిళలు - 1,98,840
యర్రగొండపాలెం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
రాష్ట్ర మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ను పక్కనబెట్టి యర్రగొండపాలెం బరిలో తాటిపర్తి చంద్రశేఖర్ ను పోటీ చేయిస్తోంది వైసిపి. మంత్రి సురేష్ ను కొండెపికి షిప్ట్ చేసింది.
టిడిపి అభ్యర్థి :
టిడిపి కూడా ఈసారి యర్రగొండపాలెంలో ప్రయోగం చేస్తోంది. మొదటిసారి గూడూరి ఎరిక్సన్ బాబును ఇక్కడ పోటీలో నిలిపింది.యర్రగొండపాలెం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
యర్రగొండపాలెం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,73,123 (88 శాతం)
వైసిపి - ఆదిమూలపు సురేష్ - 99,408 ఓట్లు (56 శాతం) - 31,632 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - అజిత్ రావు బూదాల - 67,776 ఓట్లు - ఓటమి
యర్రగొండపాలెం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,57,884 (83 శాతం)
వైసిపి - డేవిడ్ రాజు పాలపర్తి - 85,774 (54 శాతం) - 19,071 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - అజిత రావు బూదాల - 66,703 (42 శాతం) - ఓటమి