మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి రేపు సీబీఐ కోర్టులో లొంగిపోనున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి ఈ నెల 5వ తేదీన సీబీఐ కోర్టులో లొంగిపోనున్నారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5వ తేదీ లోపుగా ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో రేపు కోర్టులో లొంగిపోతానని ఎర్ర గంగిరెడ్డి మీడియాకు చెప్పారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబఐ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును ఇ,చ్చింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 27న తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
undefined
గతంలో ఈ కేసును విచారించిన సిట్ సకాలంలో చార్జీషీట్ దాఖలు చేయని కారణంగా ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరైందని సీబీఐ వాదించింది. అన్ని వర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది.
also read:వైఎస్ వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి షాక్: బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఈ ఏడాది జూన్ 30వ తేదీ లోపుగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూలై 1వ తేదీన ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని సీబీఐ కోర్టును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది జూన్ 30వ వరకు ఎర్ర గంగిరెడ్డి జైల్లో ఉండనున్నారు.. సీబీఐ కోర్టులో ఆయన రేపు లొంగిపోనున్నారు.