ఎమ్మిగనూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 21, 2024, 7:56 PM IST
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు దామోదరం సంజీవయ్య , కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి ఉద్ధండులు ఎమ్మిగనూరు నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఓ వైపు ఫ్యాక్షనిజం, మరోవైపు శాంతంగా వుండే ప్రజలు ఎమ్మిగనూరును ప్రత్యేకంగా నిలబెడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఎమ్మిగనూరు రాజకీయాలను శాసించాయి. 1955లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 5 సార్లు , వైసీపీ రెండు సార్లు, ఇతరులు ఒకసారి విజయం సాధించారు.  చెన్నకేశవరెడ్డికి బదులు మాజీ ఎంపీ , బీసీ సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు జగన్. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బీవీ మోహన్ రెడ్డి కుమారుడు బీవీ జయనాగేశ్వర రెడ్డికి చంద్రబాబు టికెట్ కేటాయించారు. 

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో విచిత్ర పరిస్ధితి వుంటుంది. ఓ వైపు ఫ్యాక్షనిజం, మరోవైపు శాంతంగా వుండే ప్రజలు ఎమ్మిగనూరును ప్రత్యేకంగా నిలబెడుతున్నారు. వ్యవసాయం, చేనేతలపై ఇక్కడి ప్రజలు ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు దామోదరం సంజీవయ్య , కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి ఉద్ధండులు ఎమ్మిగనూరు నుంచి ప్రాతినిథ్యం వహించారు. అలాగే బీవీ మోహన్ రెడ్డి , చెన్నకేశవరెడ్డిలు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 

ఎమ్మిగనూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్‌, టీడీపీలకు కంచుకోట :

కాంగ్రెస్, టీడీపీలు ఎమ్మిగనూరు రాజకీయాలను శాసించాయి. 1955లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 5 సార్లు , వైసీపీ రెండు సార్లు, ఇతరులు ఒకసారి విజయం సాధించారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నందవరం, ఎమ్మిగనూరు, గొనేగండ్ల మండలాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,253 మంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి చెన్నకేశవ రెడ్డికి 96,498 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి బీవీ జయ నాగేశ్వర రెడ్డి 70,888 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా చెన్నకేశవరెడ్డి 25,610 ఓట్ల తేడా మెజారిటీతో ఎమ్మిగనూరులో నాలుగో సారి విజయం సాధించారు. 

2024 ఎన్నికల విషయానికి వస్తే.. సామాజిక సమీకరణలు, వ్యతిరేకత, సర్వే రిపోర్టుల ఆధారంగా ఇన్‌ఛార్జ్‌లను మారుస్తున్న జగన్..చెన్నకేశవ రెడ్డి విషయంలో మాత్రం వయసును కారణంగా చూపారు. వివాదరహితుడిగా ఆయనకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరుంది. 2004 నుంచి 2012 వరకు వరుస విజయాలు సాధించిన చెన్నకేశవరెడ్డికి మధ్యలో ఒకసారి టికెట్ కేటాయించలేదు. 2019లో టికెట్ కట్టబెట్టగా.. భారీ విజయం అందుకున్నారు. దీనిని బట్టి ఆయన జస్ట్ నిలబడితే చాలు గెలుపు పక్కా అన్న గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నకేశవరెడ్డికి బదులు మాజీ ఎంపీ , బీసీ సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు. అయితే ఆమెకు స్థానిక వైసీపీ కేడర్ సహకరిస్తుందా లేదా అన్నది అనుమానంగా వుంది.

ఎమ్మిగనూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. చెన్నకేశవరెడ్డిని పక్కనబెట్టిన జగన్ :

టీడీపీ విషయానికి వస్తే.. తన ఒకప్పటి కంచుకోటలో ఈసారి ఎలాగైనా జెండా పాతాలని గట్టి పట్టుదలతో వుంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బీవీ మోహన్ రెడ్డి కుమారుడు బీవీ జయనాగేశ్వర రెడ్డికి చంద్రబాబు టికెట్ కేటాయించారు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా తాను గెలుస్తానని బీవీ గట్టి ధీమాగా వున్నారు. 
 

click me!