కోడుమూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 21, 2024, 6:51 PM IST
Highlights

కోడుమూరు తొలి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. ఎస్సీ వర్గానికి ఈ నియోజకవర్గాన్ని రిజర్వ్ చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి దళిత సీఎంగా పనిచేసిన దామోదరం సంజీవయ్య ఈ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్వగ్రామం లద్దగిరి కూడా ఈ నియోజకవర్గంలోనే వుంది. 1962లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, వైసీపీ రెండు సార్లు, టీడీపీ, స్వతంత్ర పార్టీ ఒక్కోసారి విజయం సాధించాయి. కోడుమూరులో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్‌ను కాదని.. డాక్టర్ ఆదిమూలపు సతీష్‌ను బరిలో దించారు.  కోడుమూరులో ఈసారి జెండా పాతాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ తరపున బొగ్గుల దస్తగిరిన బరిలో దించారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొడుమూరు నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్ధానం వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి దళిత సీఎంగా పనిచేసిన దామోదరం సంజీవయ్య ఈ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. కోడుమూరు తొలి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. ఎస్సీ వర్గానికి ఈ నియోజకవర్గాన్ని రిజర్వ్ చేశారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్వగ్రామం లద్దగిరి కూడా ఈ నియోజకవర్గంలోనే వుంది. డీ మునిస్వామి మూడు సార్లు, ఎం శిఖామణి నాలుగు సార్లు కోడుమూరు నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,16,090 మంది. ఈ సెగ్మెంట్ పరిధిలో కర్నూలు, సీ బెలగల్, కోడుమూరు, గూడురు మండలాలున్నాయి. 

కోడుమూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్‌కు కంచుకోట :

1962లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, వైసీపీ రెండు సార్లు, టీడీపీ, స్వతంత్ర పార్టీ ఒక్కోసారి విజయం సాధించాయి. కాంగ్రెస్ తర్వాత ఇక్కడ వైసీపీ పాగా వేయగా.. టీడీపీ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 1985లో దాదాపు 40 ఏళ్ల క్రితం చివరిసారిగా ఎం శిఖామణి తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్టీఆర్, చంద్రబాబులు ఎన్ని ప్రయోగాలు చేసినా .. కోడుమూరులో పసుపు జెండా ఎగరడం లేదు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి జే సుధాకర్‌కు 95,037 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి బూర్ల రామాంజనేయులకు 58,992 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 36,045 ఓట్ల తేడాతో కోడుమూరులో విజయం సాధించింది.

కోడుమూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌‌పై వైసీపీ కన్ను :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. కోడుమూరులో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్‌ను కాదని.. డాక్టర్ ఆదిమూలపు సతీష్‌ను బరిలో దించారు. ఆయనకు అన్ని రకాల సహాయ సహాకారాలు అందించాల్సిందిగా పార్టీ నేతలను జగన్ ఆదేశించారు. టీడీపీ విషయానికి వస్తే.. తనకు కోరకరాని కొయ్యగా వున్న కోడుమూరులో ఈసారి జెండా పాతాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ తరపున బొగ్గుల దస్తగిరిన బరిలో దించారు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తనను గెలిపిస్తాయని దస్తగిరి ధీమాగా వున్నారు. 
 

click me!