అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు వైసీపీ నిర్ణయం

First Published Oct 23, 2017, 6:07 PM IST
Highlights
  • అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ ఎంఎల్ఏలు నిర్ణయించారు.
  • ఫిరాయింపుల వ్యవహారంపైనే ప్రతిపక్ష ఎంఎల్ఏలు అధికారపార్టీ తీరుపై మండిపడుతున్నారు.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ ఎంఎల్ఏలు నిర్ణయించారు. ఫిరాయింపుల వ్యవహారంపైనే ప్రతిపక్ష ఎంఎల్ఏలు అధికారపార్టీ తీరుపై మండిపడుతున్నారు. 21 మంది ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రోత్సహిచంటమే కాకుండా అందులో నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టటాన్ని వైసీపీ తవ్రంగా ఆక్షేపిస్తోంది. నవంబర్ 10వ తేదీ నుండి మొదలవుతున్న శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఎంఎల్ఏలు సమావేశమయ్యారు.

అనంతరం సీనియర్ ఎంఎల్ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, అధికారపక్షం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నట్లు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న అసెంబ్లీకి హాజరుకాకపోవటమే మంచిదని ఎంఎల్ఏలు అభిప్రాయపడుతున్నట్లు పెద్దిరెడ్డి చెప్పారు. ఫిరాయింపు మంత్రులను భర్తరఫ్ చేసి, ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయిస్తే కానీ అసెంబ్లీకి హాజరుకాకూడదని ఎంఎల్ఏలు అనుకుంటున్నట్లు  చెప్పారు. ఇదే విషయమై ఈనెల 26వ తేదీన మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కూడా ఎంఎల్ఏలు అనుకున్నట్లు పెద్దరెడ్డి తెలిపారు. అయితే, అంతిమ నిర్ణయం జగన్ కే వదిలిపెట్టారు.

click me!