నన్ను మరోసారి అరెస్ట్ చేసే కుట్ర: ఏపీ సర్కార్ పై రఘురామ సంచలనం

Published : Feb 27, 2022, 04:18 PM ISTUpdated : Feb 27, 2022, 04:22 PM IST
నన్ను మరోసారి అరెస్ట్ చేసే కుట్ర: ఏపీ సర్కార్ పై రఘురామ సంచలనం

సారాంశం

తనను మరోసారి అరెస్ట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.


హైదరాబాద్: తనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ నిఘా పెట్టించారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.తనను మరోసారి అరెస్ట్ చేసేందుకు హైద్రాబాద్‌లోని తన నివాసం వద్ద మఫ్టీలో Policeలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు.

వైసీపీ రెబెల్ ఎంపీ Raghurama krishnam Raju ఆదివారం నాడు New Delhi లో మీడియాతో మాట్లాడారు.  తనపై ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆయన చెప్పారు.  YS Jagan మైండ్‌లో ఏముందో అర్ధం కావడం లేదన్నారు. .ఎలాగో  తనను ఏపీకి రానివ్వడం లేదు, Hyderabad కూడా రానివ్వరా అని ఆయన ప్రశ్నించారు.  ప్రివిలేజ్‌ కమిటీ నివేదిక ఇచ్చినా ఇప్పటికీ యాక్షన్ తీసుకోలేదని ఆయన జగన్ సర్కార్ పై మండిపడ్డారు. సమాజంలో ఏం జరుగుతుందో ప్రజలే గమనిస్తున్నారని  రఘురామకృష్ణంరాజు చెప్పారు.

ఒక ఎంపీకి ప్రశాంతంగా జీవించే హక్కు లేదా? నా హక్కును హరించే అధికారం జగన్‌కి ఎవరిచ్చారు? నా వ్యక్తిగత హక్కును హరిస్తున్నారన్నారు.  ఈ విషయంపై స్పీకర్ ఓం బిర్లా, ప్రివిలేజ్‌ కమిటీకి లేఖ రాశానని చెప్పారు. నాపై నిఘా, Pawan Kalyan పై పగ జగనన్నకి ఎందుకని రఘురామకృష్ణంరాజు అడిగారు. 

Bheemla Nayak సినిమాలో పవన్‌ అద్భుతంగా నటించారన్నారు. . పవన్‌ ఎక్స్‌ట్రార్డినరీ యాక్షన్‌ చేస్తే పేర్నినాని ఎక్స్‌ట్రార్డినరీ ఓవర్‌ యాక్షన్‌ చేశారని రఘురామ సెటైర్లు వేశారు. భీమ్లానాయక్‌పై ఏపీ ప్రభుత్వం కుట్రలు చేసి కొన్ని చోట్ల థియేటర్లు బంద్ చేశారని ఆయన ఆరోపించారు.  అవసరం లేకపోయినా సినిమా విషయంలో జగన్ అల్లరి పాలయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు.  సీఎం జగన్ వైఖరితో వైసీపీ తమ దెబ్బతింటుందని  అని రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.

ఈ ఏడాది జనవరి 12 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజుకు నోటీసు ఇచ్చారు.ఈ నోటీసులు తీసుకొన్న రఘురామకృష్ణంరాజు విచారణకు హాజరౌతానని చెప్పారు. కానీ అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేని ఆయన జనవరి 17న ప్రకటించారు.  ఈ మేరకు ఆయన సీఐడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా  మీడియాలో వ్యాఖ్యలు చేశారని  ఏపీ సీఐడీ అధికారులు 2021 మే 14న రఘురామకృష్ణంరాజును Hyderabad లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ  ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యవహరించారని 124-ఏ , Ipc  153 - బీసెక్షన్ కింద సీఐడీ కేసు నమోదుచేసింది. దీంతో పాటుగా ఐపీసీ సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపీసీ సెక్షన్ 120-B కింద దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.  ఈ కేసులో  ఆయనను సీఐడీ అరెస్ట్ చేసింది.

తనపై నమోదైన కేసుల విషయమై పలు కోర్టుల్లో రఘురామకృష్ణంరాజు పిటిషన్లు దాఖలు చేశారు. చివరకు ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.దీంతో 2021 మే 21న రఘురామకృష్ణంరాజుకు supreme court బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్‌ తీసుకోవచ్చని తెలిపింది. 

 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu