వైసీపీ ఎంపీలు మాధవి, రెడ్డప్పలకు కరోనా పాజిటివ్

By telugu teamFirst Published Sep 14, 2020, 10:45 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రెడ్డప్ప, మాధవిలకు కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్లమెంటు సభ్యులు ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ రెడ్డప్పకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఐసోలేషన్ లో ఉండాలని ఆయనకు సూచించారు 

అరకు ఎంపీ మాధవికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో రెండు వారాల పాటు ఆమె ఢిల్లీలోనే చికిత్స తీసుకుంటారు 

కాకినాడ ఎంపీ వంగ గీతకు ఇదివరకే కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారంనాడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. 

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్ర మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నా సభలోకి అనుమతి ఉండదని స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు. 

click me!