ఈవీఎంల ట్యాంపరింగ్ బాబుకి బాగా తెలుసు.. విజయసాయిరెడ్డి

Published : Dec 18, 2018, 02:04 PM ISTUpdated : Dec 18, 2018, 03:08 PM IST
ఈవీఎంల ట్యాంపరింగ్ బాబుకి బాగా తెలుసు.. విజయసాయిరెడ్డి

సారాంశం

ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలకు చిత్తసుద్ది లేదని విమర్శించారు. సభలో కనీసం నిరసన కూడా వ్యక్తం చేయడంలేదని, కొందరు సభ్యులు అసలు సమావేశాలకు కూడా హాజరుకావడంలేదని అన్నారు.

ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం చంద్రబాబుకి బాగా తెలుసు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌ ముందుగల గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలకు చిత్తసుద్ది లేదని విమర్శించారు. సభలో కనీసం నిరసన కూడా వ్యక్తం చేయడంలేదని, కొందరు సభ్యులు అసలు సమావేశాలకు కూడా హాజరుకావడంలేదని అన్నారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు ఎక్కువ రాబట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈసారి మాత్రం బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు జరపాలని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు.

ఈవీఎంలకు ట్యాంపరింగ్‌ చేయడం బాబుకు బాగా తెలుసని, ఇప్పుడు ఆయన ఎత్తులు సాగవని తెలిసి ముందే భయపడుతున్నారని అన్నారు. ఏపీలో తుపానుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు మాత్రం ప్రమాణ స్వీకారాల యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్