శాసనసభ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తన: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై శ్రీకాంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Mar 25, 2022, 3:35 PM IST

ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.చర్చ చేయాలని లేవనెత్తి చర్చకు సహకరించకుండా టీడీపీ సభ్యులు అసెంబ్లీలో గొడవ చేశారన్నారు.


అమరావతి: శాసనసభ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా  టీడీపీ సభ్యులు వ్యవహరించారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్  శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. 

శుక్రవారం నాడు మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్Gadikota Srikanth Reddyమీడియాతో మాట్లాడారు. ప్రతి అంశంపై అధికార పార్టీ సుదీర్థ వివరణ ఇచ్చిందన్నారు.  పోలవరంపై TDPకి అనుమానాలు ఉంటే చర్చలో ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారన్నారు. ఒక్క రోజూ విజిల్స్ వేయడం, మరో రోజు చిడతలు వాయించడం వంటి కార్యక్రమాలు చేసిన సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించారన్నారు. 

Latest Videos

ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. కానీ  ఈ విషయమై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భయంతో సభలో గందరగోళం సృష్టించిందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇళ్ల పట్టాలపై CMతో పాటు మంత్రులు కూడా వివరణ ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.  AP Assembly లో గందరగోళం సృష్టించేందుకే టీడీపీ సభ్యులు పనిగా పెటట్టుకొన్నారన్నారు.

Jangareddy Gudem అంశంపై టీడీపీ సభ్యులు శవ రాజకీయాలు చేశారన్నారు.  మద్యంపై స్వల్పకాలిక చర్చకు కూడా ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. ఈ చర్చలో టీడీపీ సభ్యులు పాల్గొనలేదన్నారు.Chandrababu సీఎంగా ఉన్న కాలంలో అనుమతులిచ్చిన డిస్టిలరీలతో పాటు బ్రేవరేజీల గురించి ఆధారాలతో కూడా ప్రభుత్వం ప్రకటన చేయడంతో టీడీపీ నేతలకు మతి పోయిందన్నారు.

Three capitals  అంశంపై కోర్టులు ఇచ్చిన తీర్పుకు సంబంధించి అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చ జరిగిందన్నారు. ఆయా వ్యవస్థల్లో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని ఈ చర్చలో పాల్గొన్న  పలువురు సభ్యులు పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు Supreme court తీర్పులను కూడా ఆయన ప్రస్తావించారు.

click me!